పక్కింటి వారి భార్యను దొంగిలిస్తేనే అక్కడి యువకులకు పెళ్లి..

by Sumithra |   ( Updated:2023-06-16 14:42:03.0  )
పక్కింటి వారి భార్యను దొంగిలిస్తేనే అక్కడి యువకులకు పెళ్లి..
X

దిశ, వెబ్‌డెస్క్ : వివాహవ్యవస్థలో ఎన్నో రకాల వివాహాలు జరుగుతుంటాయి. వాటిలో దైవ వివాహం, అర్షవివాహం, ప్రజాపత్య వివాహం, అసుర వివాహం, గాంధర్వ వివాహం, రాక్షస వివాహం, పైశాచిక వివాహం ఇలా ఎన్నో రకాల వివాహాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే వివాహాలు ఒక్కో దేశంలో, ఒక్కో తెగలలో వారి వారి సాంప్రదాయ పద్ధతులలో జరుపుతుంటారు. వివాహం సమయంలో రకరకాల వింత సంప్రదాయాలు, ఆచారాలను పాటిస్తుంటారు. ఏ సాంప్రదాయంలో ఐనా చూపులు చూసో, లేదా ప్రేమ వివాహమో చేసుకుంటారు. కానీ ఓ దేశంలో మాత్రం ఏకంగా ఇతరుల భార్యను దొంగిలించి ఆ మహిళను పెళ్లి చేసుకుంటారు. అలా చేసినా వారికి ఎలాంటి జరిమానాలు, ఎలాంటి శిక్షలు ఉండవు. వింటుంటేనే చాలా ఎక్సైటింగా ఉంది కదా. ఇంతకీ అది ఏ దేశం, అక్కడ ఎందుకు ఇలాంటి ఆచారం ఉంది ఇప్పుడు తెలుసుకుందాం.

ఆఫ్రికాదేశంలో వోడబ్బో తెగలో ఈ వింత ఆచారం కొనసాగుతుంది. ఆ తెగలోని ప్రజలు వివాహం చేసుకోవాలనుకుంటే వారు ఇతరుల భార్యలను దొంగిలించి వారిని వివాహం చేసుకోవాలి. అలా చేసినప్పటికీ ఆ గ్రామానికి చెందిన వారు ఎవరూ కూడా ఎలాంటి శిక్షలు వేయరంట. అయితే ఈ తెగలో పుట్టిన వారి మొదటి వివాహం కుటుంబ సభ్యుల అంగీకారంతో జరిగినప్పటికీ రెండో పెళ్లి చేసుకోవాలి అనుకునేవారు మాత్రం వింత ఆచారాన్ని పాటించాల్సిన పని ఉంది. అలా కుదరకపోతే రెండో పెళ్లి చేసుకునే అర్హత కోల్పోతారట.

ఇతరుల భార్యను ఎలా దొంగిలిస్తారు..

ప్రతి ఏడాది వోడబ్బో తెగ గిరిజనులు గేరెవోలు ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ పండగలో అబ్బాయిలు ముఖం నిండా రంగులు పూసుకుని నృత్య ప్రదర్శన చేస్తూ ఇతరుల భార్యను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. అయితే ఆ విషయం మహిళ భర్తకు తెలియకుండా మహిళలను ఆకర్షించాల్సి ఉంటుందంట. అప్పుడు మహిళ అతడి పట్ల ఆకర్షితురాలై అతనితో వెళ్లిపోవచ్చు. లేదా మహిళలను యువకుడు ఎవరికీ తెలియకుండా ఎత్తుకెళ్లిపోవచ్చు. అలా చేసినప్పుడు వారి తెగవారు ఆ ఇద్దరికీ మళ్లీ వివాహం జరిపిస్తారు.

Also Read..

అక్కడ వివాహానికి ముందు వరుడు, వధువుకు లోదుస్తులు కొనివ్వాల్సిందే.. లేదంటే పెళ్లిలోనే అలా

మగవాళ్లలో ఆడవాళ్లకు నచ్చని గుణాలు ఇవే.. అలా చూస్తే రచ్చరచ్చే..!

Advertisement

Next Story