- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పొద్దు పొద్దున్నే కస్టమర్లకు షాక్.. భారీగా అమూల్ పాల ధర పెంపు.. లీటర్‌కి ఎంతంటే?
దిశ, ఫీచర్స్: పాల వినియోగదారులకు అమూల్ సంస్థ భారీ షాకిచ్చింది. ఒక లీటరుపై రూ.2 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..
గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) ఆదివారం ఓ ప్రకటనలో భాగంగా పెరిగిన పాల ధర జూన్ 3 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. కాగా అమూల్ పేరుతో GCMMF పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న విషయం తెలిసిందే. దీంతో అమూల్ తాజా నిర్ణయంతో అన్ని వేరియంట్లు అమూల్ గోల్డ్, అమూల్ శక్తి, అమూల్ టీ స్పెషల్ మిల్క్ ధరలు సోమవారం నుంచి లీటరుపై రూ.2 చొప్పున పెరిగి నేటి నుంచి(జూన్ 3) దేశవ్యాప్తంగా అమూల్ సవరించిన ధరలు అమలులోకి వచ్చాయి.
*కొత్త ధరలు ఎలా ఉన్నాయి అంటే..
ధరల పెంపు అనంతరం ప్రస్తుతం అమూల్ గేదె పాల ధర లీటరుకు రూ.73 కి చేరుకుంది. అమూల్ గోల్డ్ పాలు లీటరు ధర రూ.66 నుంచి రూ.68 కాగా, అమూల్ శక్తి లీటరుకు రూ.60 కి చేరుకుంది. అమూల్ తాజా పాల ధర లీటర్ రూ.56 కాగా, ఆఫ్ లీటర్ రూ.28కి చేరింది. అమూల్ గేదె పాలు ఆఫ్ లీటర్ రూ.37, అమూల్ గోల్డ్ ఆఫ్ లీటర్ రూ.34, అమూల్ శక్తి ఆఫ్ లీటర్ రూ.30 అయింది. అమూల్ ఆవు పాల ధర లీటర్ రూ.57 కాగా, ఆఫ్ లీటర్ రూ.29కి పెరిగింది. అమూల్ స్లిమ్ అండ్ ట్రిమ్ కస్టమర్లు ఆఫ్ లీటర్ కు రూ.25, లీటర్ పౌచ్ పై రూ.49 చెల్లించాల్సి ఉంటుంది. సాగర్ స్కిమ్డ్ పాల ధర ఆఫ్ లీటర్ రూ.20, లీటర్ ధర రూ.40 వద్ద స్థిరంగా ఉన్నాయి.
*ఏడాది తర్వాత పెరిగిన అమూల్ పాల ధరలు..
ఫిబ్రవరి 2023 తర్వాత అమూల్ పాల ధరలు పెంచడం ఇదే తొలిసారి. జీసీఎంఎంఎఫ్(GCMMF) గుజరాత్ రాష్ట్రంలోని పాల సహకార సంఘాల అపెక్స్ బాడీ కామన్‌గా పాల ధరలు పెంచితే ముందుగానే ప్రకటిస్తుంది. కానీ తాజాగా పాల ధరలు నేరుగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో అమూల్ పాల వినియోగదారులపై లీటర్ పై రూ.2 మేర భారం పడుతుంది. పశుగ్రాసంతో పాటు రవాణా ఖర్చులు, పాల ఉత్పత్తి వ్యయం పెరగడంతో అమూల్ పాల ధర పెంపు నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మార్పీలో కేవలం 3, 4 శాతం పెంచామని, ఇది ఆహార ద్రవ్యోల్బణంతో పోల్చితే చాలా తక్కువ అని జీసీఎంఎంఎఫ్ పేర్కొంది. పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా, పాల ఉత్పత్తిదారులను ప్రోత్సహించేందుకు ధరలు పెంచినట్లు స్పష్టం చేసింది.