లైఫ్‌లో స్టక్ అవ్వడం ఇష్టం లేదట.. మార్పును కోరుకుంటున్న 59 శాతం మంది

by samatah |   ( Updated:2023-07-01 07:49:46.0  )
లైఫ్‌లో స్టక్ అవ్వడం ఇష్టం లేదట.. మార్పును కోరుకుంటున్న 59 శాతం మంది
X

దిశ, ఫీచర్స్ : కారణాలేమైనా మార్పు ప్రకృతి ధర్మం. కాలానుగుణంగా తాము కూడా మారాలనుకుంటారు చాలామంది. లక్షలాది మంది ప్రజలు తమ జీవితంలో కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. వ్యక్తిగత, సామాజిక అంశాల్లో మార్పును స్వాగతిస్తుంటారు. ఆరోగ్యం, ఉద్యోగం, ఇల్లు, వ్యాయామం ఇలా ప్రతీ అంశంలోనూ మార్పు అవసరమని భావిస్తుంటారు కొందరు. అయితే యునైటెడ్ కింగ్‌డమ్ కేంద్రంగా 2000 మందిపై వర్జిన్ మీడియా O2, వన్‌పోల్ సంస్థ కలిసి నిర్వహించిన సర్వే 59 శాతం మంది తమ జీవితాల్లో మార్పు అవసరమని విశ్వస్తున్నట్లు వెల్లడించింది. అలాగే 61 శాతం మంది తాము ఒకే రూట్‌లో స్టక్ అయ్యామని భావిస్తున్నట్లు పేర్కొన్నది.

ప్రజలు తమ సమీప భవిష్యత్తులో మార్చుకోవాలనుకుంటున్న సాధారణ అంశాలను పరిశీలించినప్పుడు హెయిర్ స్టైల్, మొబైల్ ఫోన్, కారు వంటివి ముందు వరుసలో ఉన్నాయి. ఆశ్చర్యంగా 12 శాతం మంది వేరే భాగస్వామిని కోరుకుంటున్నట్లు సర్వేలో పాల్గొన్న నిపుణులు వెల్లడించారు. మరో 30 శాతం మంది కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్నారు. ఇక ప్రతీ ఏడుగురిలో ఒకరు స్నేహితులను కనుగొనే విషయంలోనూ మార్పు అవసరం అని అభిప్రాయపడుతున్నారు. 2023లో సర్దుబాటు చేయాలనుకుంటున్న మార్పులపై ప్రశ్నించగా 23 శాతం మంది అడల్ట్స్ డ్రెస్‌సెన్స్ విషయంలో, 15 శాతం మంది ప్రజలు ఫ్రెండ్‌షిప్ విషయంలో, 11 శాతం మంది బ్యాంకింగ్ నిర్వహణ విషయంలో మార్పును కోరుకుంటున్నట్లు వెల్లడించారు. అయితే తమ లైఫ్‌స్టైల్‌ భిన్నంగా ఉండాలని యువత కోరుకుంటున్నప్పటికీ, కుటుంబ పెద్దలలో 36 శాతం మంది తమను తాము కొంత అనిశ్చితంగా రేట్ చేస్తున్నారు. కొన్ని విషయాల్లో మార్పు అవసరం లేదని భావిస్తున్నారు. దాదాపు 52 శాతం మంది పెద్దలు తమ జీవితంలో మార్పులు అవసరమైతే గనుక ఎక్కువ ఖర్చవుతుందని వెనుకాడుతున్నారు.

Read More: వైద్య వృత్తి పవిత్రం... వైద్యులు ప్రాణదాతలు (జాతీయ వైద్యుల దినోత్సవం)

Advertisement

Next Story

Most Viewed