ప్లాట్‌ఫామ్‌పైన ప‌డుకున్న వ్య‌క్తిని చూసి పోలీస్ ఇలా చేశాడు..?!

by Sumithra |   ( Updated:2022-03-05 09:09:50.0  )
ప్లాట్‌ఫామ్‌పైన ప‌డుకున్న వ్య‌క్తిని చూసి పోలీస్ ఇలా చేశాడు..?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ప్ర‌పంచంలో యుద్ధాలు, ఎటు చూసినా మోసాలు, స్వార్థం, హ‌త్య‌లు, అత్యాచారాలు, డ‌బ్బుపై కాంక్ష‌... ఇలా స‌మాజంలో విప‌రీతంగా హింస‌, దుర్భుద్ధి, అసాంఘీక చ‌ర్య‌లు అధిక‌మ‌వుతుంటే, కొంద‌రుంటారు... ద‌యా, జాలి, ప్రేమ‌ల‌ను ఆభ‌ర‌ణాలుగా ధ‌రించి ఏమీ ఆశించ‌కుండా అవ‌స‌రంలో ఉన్న‌వారిని ఆదుకుంటారు. స‌రిగ్గా, ఇలాగే ఉన్నాడు ఈ పోలీస్ ఆఫీస‌ర్. దిక్కూమొక్కు లేకుండా రోడ్డు ప‌క్క‌న ప్లాట్‌ఫామ్‌పైన బ‌తుకీడ్చే వృద్ధుణ్ని చూసి చ‌లించిపోయాడు. రాత్రి పూట ఓ వృద్ధుడు రోడ్డు ప‌క్క‌న బ‌స్ షెల్ట‌ర్‌లో ప‌డుకొని ఉంటాడు. చ‌లికి, దోమ‌ల తాకిడికి త‌ట్టుకోలేక, క‌ప్పుకోడానికి దుప్ప‌టి లేక ఒక ఫ్లెక్సీ బ్యాన‌ర్‌ని క‌ప్పుకొని ప‌డుకొని ఉండ‌టం చూసిన ఈ పోలీస్ వెంట‌నే వెళ్లి, ఓ ర‌గ్గును కొనితెస్తాడు. ఆ వృద్ధుడిపైన క‌ప్పి, కొంత ఆహారం కూడా ఇస్తాడు. ఇప్పుడు ఈ వీడియో ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారింది. నెటిజ‌న్లంతా ఈ పోలీస్ ఆఫీస‌ర్ రియ‌ల్ హీరో అంటూ సెల్యూట్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed