- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అనారోగ్యంతో ఉన్న బాస్‌కు కిడ్నీ ఇచ్చింది.. రిటర్న్ గిఫ్ట్‌గా జాబ్ వూస్ట్.. ఎందుకంటే...
దిశ, ఫీచర్స్ : తన బాస్ అనారోగ్యంతో బాధపడుతుందని కిడ్నీ ఇచ్చిన ఎంప్లాయీకి షాక్ తగిలింది. న్యూయార్క్ కు చెందిన డెబోరా స్టీవెన్... బాస్ జాక్వెలిన్ బ్రూసియా కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ లేట్ అవుతుందని తెలుసుకుంది. ఇంకా వెయిటింగ్ లిస్ట్ లో ఉందని తెలుసుకుని... తనే ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దీనికి బాస్ కూడా ఒప్పుకోగా.. సర్జరీ జరిగింది. అయితే ఇక్కడే అతిపెద్ద ట్విస్ట్ ఇచ్చింది కంపెనీ యజమాని. ఆమెను ఉద్యోగం నుంచి రిమూవ్ చేసింది. ఎందుకంటే కంపెనీ రూల్స్ అతిక్రమించిందని సమాధానం ఇచ్చింది.
అసలు విషయం ఏంటంటే సర్జరీ తర్వాత ఉద్యోగినికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. కాళ్ల నరాలు దెబ్బతినడం, జీర్ణ సమస్యలు, మెంటల్ హెల్త్ ఇష్యూస్ తో బాధ పడింది. రికవరీ అయ్యేందుకు నెల రోజులు పట్టింది. కానీ విషయాన్ని అర్థం చేసుకోకుండా, కనీస కృతజ్ఞత లేకుండా జాబ్ నుంచి రిమూవ్ చేసింది. దీంతో బాధితురాలు హ్యూమన్ రైట్స్ ను ఆశ్రయించింది. తర్వాత కోర్టులో కేసు ఫైల్ చేసేందుకు సిద్ధమైంది.