- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీడకలలో పాడు పని.. పురుషాంగం కత్తిరించుకున్న వ్యక్తి
దిశ, ఫీచర్స్ : ఘనా దేశానికి చెందిన ఒక రైతు నిద్రలో చేసిన పని పీడకలగా మారింది. డిన్నర్ ప్రిపేరేషన్ కోసం భార్యకు మటన్ కట్ చేయడంలో సాయపడుతున్నట్లుగా కలగంటూ తన పురుషాంగాన్నే కత్తిరించుకుని ఆస్పత్రి పాలయ్యాడు. చివరకు పురుషాంగం, వృషణాల్లో భరించలేని నొప్పి కలగడంతో నిద్రలేచిన అతను జరిగిన ఘోరం చూసి షాక్ అయ్యాడు. ఘనా సెంట్రల్ రీజియన్‌లోని అసిన్ ఫోసు అనే పట్టణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
47 ఏళ్ల కోఫీ అట్టా నిద్రలోనే ఈ చర్యకు పాల్పడగా.. అప్పుడు తన భార్య అద్వోవా కోనాడు ఇంట్లో లేదు. పొరుగువారి ద్వారా విషయం తెలుసుకుని ఇంటికి చేరుకున్న అద్వోనా.. వేలాడుతున్న కోఫీ పురుషాంగం నుంచి రక్తస్రావం అవుతున్నట్లు గుర్తించింది. రక్త ప్రవాహాన్ని తగ్గించేందుకు అతనికి డైపర్ వేసి వెంటనే సమీప ఆస్పత్రికి తీసుకెళ్లింది. ప్రాథమికంగా డాక్టర్లు చికిత్స చేసినప్పటికీ సర్జరీ చేయాల్సిన అవసరముందని, ఇందుకోసం చాలా డబ్బు అవసరమని కోఫీ పేర్కొన్నాడు.
'ప్రస్తుతం ఆస్పత్రిలో ఫ్లూయిడ్స్, ఇంజెక్షన్లు ఇస్తున్నారు కానీ నాకు శస్త్రచికిత్స అవసరం. అంబులెన్స్‌కు ఫ్యూయెల్ ఖర్చుల కోసం కూడా డబ్బు లేదు. కాబట్టి డాక్టర్లు నన్ను సర్జరీ కోసం Komfo Anokye టీచింగ్ హాస్పిటల్ (KATH)కు తీసుకువెళ్లారు' అని BBC పిడ్జిన్ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక సంఘటన విషయానికొస్తే.. కుర్చీలో కూర్చొని నిద్రపోతున్నప్పుడు మాంసం కోస్తున్నట్లుగా కల వచ్చిందని, అయితే కత్తి ఎలా తీసుకువెళ్లానో గుర్తు లేదని, నిజంగా గందరగోళానికి గురయ్యానని చెప్పుకొచ్చాడు.
మొత్తానికి సర్జరీ ద్వారా డాక్టర్లు అతని పురుషాంగాన్ని అతికించగలిగారు. ఆరు వారాల తర్వాత అతను మునుపటి మాదిరిగానే అంగస్తంభన పొందగలిగాడు.