- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ సముద్ర గర్భంలో అద్భుతమైన పురాతన నిర్మాణం..
దిశ, వెబ్‌డెస్క్ : మన ప్రపంచంలో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు అప్పుడప్పుడూ వెలుగుచూస్తుంటాయి. ముఖ్యంగా మనదేశంలో ఉన్న సముద్ర గర్భంలో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు పురావస్తు శాస్త్రవేత్తలకు కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాంటి ఓ ఆసక్తికరమైన విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మధ్యదరా సముద్రం అడుగున ఒకటి కాదు, రెండు కాదు సుమారుగా 7వేల ఏండ్లనాటి ఓ రోడ్డు మార్గాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ రహదారి నాలుగు మీటర్ల వెడల్పు ఉండి, రాళ్లను క్రమంగా పేర్చి నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ పురాతన మార్గం హ్వార్ సంస్కృతికి చెందిందిగా భావిస్తున్నారు.
ఈ రోడ్డు మార్గం ద్వారా క్రొయేషియన్ ద్వీపంలోని కోర్కులా తీరానికి చేరుకోవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ రోడ్డుపైన పూర్వం ప్రజలు నడిచేవారని శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది. పూర్వం సమీపంలోని ద్వీపాల్లో, సముద్ర తీరం వెంబడి అప్పటి ప్రజలు చిన్న చిన్న సమూహాలుగా జీవించే వారు. వాళ్లు పశుపోషణ చేస్తూ, వ్యవసాయం చేస్తూ వారి జీవనం గడిపేవారు. ఈ రహదారి నియోలిథిక్ సెటిల్మెంట్‌లో ఒక భాగం అని పరిశోధకులు భావిస్తున్నారు.
ఇకపోతే శాస్త్రవేత్తలు పురావస్తు పరిశోధనల్లో భాగంగా వారికి దొరికిన ఓ చెక్కను రేడియో కార్బన్ అనాలిసిస్ ద్వారా పరిశీలించారు. ఆ తరువాతే ఆ మార్గం సుమారుగా 7 వేల ఏండ్లనాటిదని తెలిపారు. రోడ్డు మార్గంతో పాటు సోలిన్ సైట్ వద్ద ఒక కట్టడాన్ని కూడా పరిశోధకులు గుర్తించినట్లు తెలిపారు. వాటితో పాటుగానే రాతి గొడ్డళ్లు వంటి నియోలిథిక్ వస్తువులు, చెకుముకి బ్లేడ్లను కూడా వారు గుర్తించినట్లు తెలిపారు.