- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కిలో కూరగాయలు రూ.85,000 మాత్రమే.. ఎక్కడో కాదు.. మన దగ్గరే!
దిశ, వెబ్‌డెస్క్ : సాధారణంగా కిలో టమాట రూ.100కు పెరిగితేనే అంత ధరనా అని అనుకుంటాం.. కానీ ఓ కూరగాయ మాత్రం కిలో ఏకంగా రూ.85,000 పలుకుతుండటం గమనార్హం. ఆ కూరగాయ పేరు హాప్ షూట్స్. ప్రపంచంలోనే అరుదుగా దొరికే ఈ కూరగాయ మన దేశంలోనే పండించడం విశేషం.
బిహార్‌లోని కరండిహ్ గ్రామానికి చెందిన అమరేష్ సింగ్ అనే 38 ఏళ్ల రైతు వ్యవసాయాన్ని సరికొత్త మార్గంలో చేస్తున్నాడు. ఎంతో విలువైన కూరగాయను తన పొలంలో పండిస్తూ.. లాభాలు అర్జిస్తున్నాడు. రూ.2.5 లక్షల పెట్టుబడితో ఔరంగబాద్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో ‘హాప్-షూట్స్’ అనే అరుదైన కూరగాయను పండిస్తున్నారు. మార్కెట్లో దీని విలువ కిలో రూ.85 వేలు వరకు ఉంది. అమరేష్ ప్రస్తుతం దీన్ని ప్రయోగాత్మకంగా పండించాడు. దీనికి మంచి గిరాకీ లభిస్తుండటంతో పూర్తిస్థాయిలో పంటను అందుబాటులోకి తేవాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ కూరగాయ ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్లో మాత్రమే కనిపిస్తుంది. ఆరేళ్ల కిందట అంతర్జాతీయ మార్కెట్లో ఈ కూరగాయ విలువ కిలోకు రూ.1.01 లక్షల వరకు ధర పలికేది.‘హాప్-షూట్స్’ సాదాసీదా పంట కాదు. ఇది శరీరంలో క్షయ(టీబీ)తో పోరాడే యాంటీబాడీస్ సృష్టిస్తుంది. ఇందులోని ఆమ్లాలు క్యాన్సర్ కణాలను చంపేస్తాయి. లుకేమియా కణాలను బ్లాక్ చేస్తాయి. వీటిని బీర్ల తయారీకి ఉపయోగిస్తారు. ఆల్కహాల్ పానీయాలు ఉత్పత్తిలో ఉపయోగిస్తారు. అందుకే ఈ కూరగాయకు బాగా డిమాండ్ ఉంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి: వేసవిలో నోరూరించే ఊరగాయ పచ్చడి.. ఎలా పెట్టాలో తెలుసా?