- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్యకు అక్కడ వెంట్రుకలు ఉన్నాయని వదిలేసిన భర్త..!
దిశ, వెబ్‌డెస్క్: అమ్మాయిల్లో అందగత్తెలు, అందవికారంగా ఉన్న వాళ్లు ఉంటారు. యావరేజ్ గ్లామర్ ఉన్న వాళ్లూ ఉంటారు. పెళ్లి సమయంలో అబ్బాయిలు ముఖ సౌందర్యం ఉన్న వాళ్లకే ఎక్కువ ప్రిపరెన్స్ ఇస్తారు. కానీ అబ్బాయిలు అమ్మాయిల అందాన్ని చూసినంత ఈజీగా వారి మనసును చూడలేక పోతున్నారు. ఆ మనసును అర్ధం చేసుకోని వాళ్లే త్వరగా విడిపోవడానికి సిద్ధపడుతుంటారు. ఇలాంటి సంఘటనే ఓ యువతికి ఎదురైంది. అతి చిన్న కారణాన్ని చూపి ఆమెను అర్ధాంతరంగా వదిలేసి వెళ్లాడు. భార్య మనసును తీవ్రంగా గాయపరిచాడు.
రాజమండ్రికి చెందిన ఓ యువతి హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుంది. పెళ్లి చేసుకోవాలని ఇంట్లో వాళ్లు ఒత్తిడి చేసినా జీవితంలో స్థిరపడిన తర్వాతనే పెళ్లి అంటూ తనకు 30 ఏళ్లు దాటినా వాయిదా వేసుకుంటూ వచ్చింది. ఆర్థికంగా ఏలోటు లేదనుకుని గత ఏడాదే విశాఖపట్నానికి చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అందగత్తైన యువతిని చూసి ముగ్ధుడైన అతడు కట్నకానుకలు తక్కువైనా పర్వలేదని వివాహం చేసుకున్నాడు. ఇంత వరకు బాగానే ఉన్నా.. శోభనం రోజే అతగాడి నిజస్వరూపం బయటపడింది.
పెళ్లికి ముందు ఆమె అందం గురించి అహో.. ఒహో.. అని పొగడ్తలతో ముంచెత్తిన యువకుడు.. శోభనం రాత్రి నీ కాళ్లకు, చేతులకు మగవాళ్ల మాదిరిగా దట్టంగా వెంట్రుకలు ఉన్నాయని వేధింపులు ప్రారంభించాడు. అలా ప్రతి రాత్రి ఆమెకు చుక్కలు చూపించేవాడు. అసలు నువ్వు అమ్మాయివా..? అబ్బాయివా.. అంటూ ఎగతాళి చేయడంతోపాటు నీ వెంట్రుకలను చేస్తూ నాకు కోరికలు కలగడం లేదని రకరకాలుగా మానసికంగా చిత్రహింసలు గురి చేసి చివరికి ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు.
గత కొన్నా్ళ్లుగా తీవ్ర మానసిక వేదనను అనుభవించించిన ఆమె.. చివరకు తన శరీరంపై ఉన్న అవాంఛిత రోమాలను లేజర్ ట్రీట్ మెంట్ ద్వారా తొలగించుకుంది. ప్రస్తుతం ఆమెకు మరో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ప్రయత్నాలు మొదలు పెట్టినా.. మొదటి భర్త ఇచ్చిన షాక్‌తో మళ్లీ వచ్చే భర్త తనను ఆదరిస్తాడా లేదా అనే అనుమానం పెట్టుకుంది. అదే వేదనతో తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తోంది. దీంతో తల్లిదండ్రులు ఆమెను సైకాలాజిస్ట్ దగ్గరకు తీసుకెళ్లగా భర్తతో అనుభవించిన నరకాన్ని చెప్పుకోని కన్నీటి పర్యంతం అయింది. ప్రస్తుతం సదరు యువతిని మానసిక నిపుణులు కౌన్సెలింగ్ఇస్తూ చికిత్సను అందిస్తున్నారు.
Read more:
శృంగారానికి బానిసైన బాలీవుడ్ బ్యూటీ.. ఉమైర్ సంధు ట్వీట్ వైరల్
తల వెంట్రుకల్లో స్ట్రెస్ హార్మోన్స్ .. గుండె జబ్బులు వచ్చే చాయిస్ !