తండ్రిని పెళ్లి చేసుకున్న కూతురు.. ఏకంగా ఇద్దరు పిల్లలకు తల్లి

by samatah |   ( Updated:2023-03-09 10:02:24.0  )
తండ్రిని పెళ్లి చేసుకున్న కూతురు.. ఏకంగా ఇద్దరు పిల్లలకు తల్లి
X

దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని ఓ తీపి జ్ఞాపిక. రెండు జీవితాలు ఒకటిగా మారి, కష్టాల్లో, సుఖంలో పాలుపంచుకుంటూ, ఒకరికి ఒకరు తోడుగా సాగుతారు. ఇక ఎవరైనా తమకు దగ్గరి బంధువులను, వరసైన వాళ్లను పెళ్లి చేసుకుంటారు. మరీ అంటే తెలిసిన వ్యక్తి, స్నేహితులను ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కానీ ఇక్కడ ఓ మహిళ మాత్రం ఏకంగా తన తండ్రినే పెళ్లి చేసుకుంది. అంతే కాకుండా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఇదెక్కడనుకుంటున్నారా?

అమెరికాలోని లాస్ వెగాస్‌లో జరిగింది. అయితే ఓ యువతి తన సవితి తండ్రిని పెళ్లాడింది. అతన్ని చూడగానే ప్రేమలో పడిపోయానని, అతనితోనే జీవితం పంచుకోవాలనుకున్నా, అందుకే ఆయన్ని పెళ్లి చేసుకున్నా.. నేను చాలా అదృష్టరాలిని అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.తల్లిని మోసం చేయడం ప్రపంచంలోనే అత్యుత్తమ నిర్ణయంగా భావించినప్పటికీ, తాను మాత్రం తండ్రితో సంతోషంగా ఉన్నానని పేర్కొంది.అంతే కాకుండా తన తల్లి కూడా ఇప్పటికీ తనతో బానే ఉందని పేర్కొంది.ఈ విషయంపై ఒక్కొక్కరు ఒక్కోవిధంగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.

Read more:

శృంగారాన్ని మహిళలు ఎలా ఆస్వాదించాలి..?

Advertisement

Next Story