తినకూడని వాటిని తింటున్న చిన్నారి.. దానికి కారణం అదే అంటున్న వైద్యులు..

by Sumithra |
తినకూడని వాటిని తింటున్న చిన్నారి.. దానికి కారణం అదే అంటున్న వైద్యులు..
X

దిశ, ఫీచర్స్ : ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఆరోగ్యకరమైన వాటిని తినాలని, త్రాగాలని అనుకుంటారు. దాంతో వారి ఆరోగ్యం బాగుంటుందని అనుకుంటారు. దీని కోసం తల్లిదండ్రులు తమ పిల్లలకు పండ్లు, పాలతో పాటు బ్రెడ్, కూరగాయలు, పప్పులు మొదలైనవి తినిపిస్తారు. పిల్లలు కొంచెం అయిష్టంగా ఉన్నప్పటికీ, తల్లిదండ్రులు ఏదో ఒక విధంగా వారికి ఆహారం తినిపిస్తూ ఉంటారు. కానీ మీ బిడ్డ తినదగిన వాటిని తినడానికి బదులుగా తినకూడని వాటిని తినడం ప్రారంభిస్తే ఏమి జరుగుతుందో ఒక్క ఊహించండి. అవును ఓ మూడేళ్ల బాలిక ఇలాంటి వింత పనులు చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఈ చిన్నారి వార్తల్లో తెగ వైరల్ అవుతోంది.

న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం ఓ అమ్మాయి ఒక వింత వ్యాధితో బాధపడుతోంది. అందులో ఆమె ఇంట్లో ఉన్న మంచాలు, సోఫాలు, మెత్తని బొంతలు, దుప్పట్లు, అద్దాలు కూడా తినడం ప్రారంభిస్తుంది. వీటిని తినడం వలన పిల్లలకి తీవ్రమైన హాని కలుగుతుంది. కానీ ఆమె చిన్నపిల్ల ఏమి తినాలి, ఏది తినకూడదు అనే దాని పై ఆమెకు అవగాహన లేదు.

గృహోపకరణాలు కూడా తినడం..

తన కూతురు వింటర్ కూడా ఇంటి గోడల నుండి ప్లాస్టర్ తినడం ప్రారంభిస్తుందని బాలిక తల్లి స్టేసీ అహెర్న్ చెప్పారు. అంతే కాదు, ఆమె సోఫా దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆమె దాని ఫాబ్రిక్, స్పాంజ్ తినడానికి ప్రయత్నిస్తుందట. కొన్నిసార్లు చెక్క ఫర్నిచర్ కూడా తినడం ప్రారంభిస్తుందట. దీంతో ఆ పాపని పగలు, రాత్రి అని తేడా లేకుండా పర్యవేక్షించవలసి ఉంటుందని స్టేసీ చెబుతున్నారు.

వింత వ్యాధితో బాధపడుతున్న చిన్నారి..

నిజానికి ఆ అమ్మాయికి పికా అనే అరుదైన తినే రుగ్మత ఉంది. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి అస్సలు తినకూడని ఇలాంటి వింత వస్తువులను తినాలనే కోరిక ఉంటుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి పెద్దగా ఏమీ చేయలేమని, వారు తినడం ద్వారా తమను తాము హాని చేసుకోకుండా అన్ని సమయాలలో జాగ్రత్తలు తీసుకుంటారని వైద్యులు చెబుతున్నారు.

Advertisement

Next Story