- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నదిలో ప్రీ వెడ్డింగ్ షూట్.. పడవ నడుపుకునే వ్యక్తి స్టిల్స్ చూస్తే నవ్వాపుకోలేరు! (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: ఖడ్గం మూవీ సీన్ రిపీట్ అయింది ఈ వీడియోలో. ఆ సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ కమెడియన్ పృధ్వీ చెప్పే డైలాగ్స్ విని విని.. వెనక భటుడిగా ఉన్న రవితేజ భారీ డైలాగ్‌ను సింగిల్ టేక్‌లో చెప్పేస్తాడు. సరిగ్గా ఈ వీడియోలో ఉన్న సీన్ కూడా దానికి సెట్ అవుతుందనడంలో సందేహం లేదు. నదిలో పడవ నడుపుకునే ఓ వృద్ధుడు తరచూ ఫ్రీ వెడ్డింగ్ షూట్లు చూసిచూసీ.. తానే డైరెక్టర్‌లా మారిపోయాడు. ఏకంగా యాక్టింగ్ చేస్తూ వధూవరుడికి ఫోజులు పెట్టించడం చూస్తే ఎవరైనా నవ్వక మానరు.
ఈ వీడియో ఎక్కడ తీశారో తెలియదు కానీ.. ఆ వృద్ధ వ్యక్తి మాత్రం ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడుతున్నాడు. నదిలో ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వచ్చిన జంటను తన పడవపై ఎక్కించుకుని నదిలోకి వెళ్లిన ఆ వ్యక్తి కాబోయే వధూవరుడికి ఫొటో స్టిల్స్ చూపించాడు. అచ్చం ప్రొఫెషనల్ ఫొటో గ్రాఫర్‌లా ఇలా నిలిచోండి.. అలా చేయి పట్టుకోండి.. చేతి ఇలా పెట్టు, కాలు ఇలా పెట్టు, అమ్మాయిని ఇలా పట్టుకో, ఇద్దరూ అటు చూసి ఫోజు ఇవ్వండి.. నువ్వు చేయి పైకి ఎత్తు.. అమ్మాయి.. ఆ చేయి పట్టుకుని చుట్టూ తిరుగుతుంది.. అంటూ సూచనలు ఇచ్చాడు. ఫొటో గ్రాఫర్‌ను వదిలిన ఆ జంట అతడు చెప్పే వాటిని ఫాలో అవుతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి మీరు ఓ లుక్ వేయండి..!