- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పెళ్లి చేయకపోతే చదువుకోనని మొండిపట్టు పట్టిన 13 ఏళ్ల బాలుడు.. చివరకు తల్లిదండ్రులు చేసిన పనికి షాక్!
దిశ, ఫీచర్స్: పిల్లల విషయంలో కొంతమంది తల్లిదండ్రులు మరీ గారాబం చేస్తుంటారు. ఏం కావాలంటే ఆ వస్తువులు కొనిపెడతారు. పిల్లలపై ఇష్టంతో అన్నదల్లా ఇస్తుండటంతో వారు మరింత నెత్తికెక్కి కూర్చుంటారు. ఆ గారాబమే పేరెంట్స్‌కు ముప్పు తెచ్చిపెడుతుంది. అయితే తాతల, ముత్తాతల కాలంలో చాలా చిన్న వయసులోనే వివాహాలు చేసుకునేవారు. పిల్లల్ని కనేవారు. కానీ బాల్యవివాహాలను సాంఘిక దురాచారంగా భావించి దానిని నియంత్రించేందుకు ప్రభుత్వాలు నడుం బిగించాయి.
ప్రస్తుతం బాల్య వివాహాలు ఎక్కడ కనిపించడం లేదు. చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. తాజాగా పాకిస్తాన్‌లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఈ బాలుడి మారం వింటే జనాలంతా ముక్కుపై వేలేసుకోవాల్సిందే. విషయానికొస్తే.. పెళ్లిళ్లు కావాలంటే పాకిస్తాన్ చట్ట ప్రకారం.. అమ్మాయిలకు 16, అబ్బాయిలకు 18 ఏళ్లు నిండాలి. కానీ ఓ 13 సంవత్సరాల పిల్లాడు తనకు వివాహం చేయాలని, లేకపోతే బడికి పోను, చదువుకోనని పేరెంట్స్‌ను బెదిరించాడు.
ఆ అబ్బాయికి ఎంత చెప్పినా వినకపోవడంతో చివరకు తల్లిదండ్రులు 12 ఏళ్ల అమ్మాయితో ఆ పిల్లాడి పెళ్లి కుదిర్చారు. రీసెంట్‌గానే వీరిద్దరి నిశ్చితార్థం కూడా జరిగింది. ప్రస్తుతం ఈ బుడ్డోడి ఎంగేజ్‌మెంట్ కు సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఏం తల్లిదండ్రులు రా బాబు పిల్లలు ఏడిస్తే పెళ్లి చేస్తారా? అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Read More..