బుడ్డోడితో తండ్రి అగ్రిమెంట్.. ఏడవకపోతే రూ. 100 ఇస్తా!

by Disha News Web Desk |
బుడ్డోడితో తండ్రి అగ్రిమెంట్.. ఏడవకపోతే రూ. 100 ఇస్తా!
X

దిశ, ఫీచర్స్ : పిల్లలు తమకు ఏదైనా వస్తువు లేదా ఫుడ్ ఐటమ్ కావాలంటే పేరెంట్స్‌పై ప్రయోగించే ప్రధాన ఆయుధం 'ఏడుపు'. తాము కోరుకున్నది దక్కించుకునే వరకు కూనిరాగాలు తీస్తూ విసిగిస్తుంటారు. తల్లిదండ్రులను ఏ పని చేయనివ్వకుండా నస పెడుతుంటారు. ఇదంతా భరించే ఓపికలేక చివరకు ఎక్కువసార్లు వాళ్ళు అడిగింది ఇవ్వడమే జరుగుతుంది. అయితే ఇలాంటి పద్ధతుల్లో ఆరితేరిన ఏడేళ్ల బాలుడు.. తనకు కావాల్సిన వస్తువుల కోసం ఏకంగా తండ్రితో ఓ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం విశేషం.

ట్విట్టర్ యూజర్@Batla_G.. తన ఆరేళ్ల కుమారుడు అబీర్‌తో చేసుకున్న ఒప్పందంపై సంతకం చేసిన చిత్రాన్ని పోస్ట్ చేశాడు. ఈ అగ్రిమెంట్‌ ఆ బాలుడి ప్లేయింగ్ టైమ్ నుంచి పాలు తాగే వరకు రోజువారీ షెడ్యూల్‌ను సూచిస్తోంది. ఉదయాన్నే అలారం మోగిన తర్వాత మేల్కొనేందుకు 10 నిమిషాల టైమ్ కేటాయించగా.. అతని భోజనం, గేమ్స్ నుంచి హోంవర్క్ చేయడం వరకు అన్నింటికీ ఇందులో సెపరేట్‌గా టైమ్ స్లాట్స్ పొందుపరిచారు. ఈ మేరకు 'ఏడుపులు, కేకలు, కొట్లాటలు' లేకుండా ప్రతీరోజు తన దినచర్యను కొనసాగిస్తే అతనికి రూ. 10 ఇచ్చేందుకు తండ్రి అంగీకరించాడు. ఇలా ఒక వారం పాటు చేయగలిగితే ఆ అబ్బాయి రూ.100 పొందగలుగుతాడు. ఇక ఈ ఒప్పందం గురించి మాట్లాడిన సదరు తండ్రి.. అంతకుముందు పాయింట్ సిస్టమ్, స్టార్ చార్ట్‌ను ప్రయత్నించినప్పటికీ వర్కవుట్ కాలేదని, ప్రస్తుతం చేసిన మార్పులు బాగా పనిచేస్తున్నాయని తెలిపాడు.

ఇక ఈ ఒప్పందాన్ని కొందరు నెటిజన్లు వినోదభరితంగా గుర్తిస్తుండగా.. మరికొందరు మాత్రం ఇలాంటి షెడ్యూల్ పిల్లలను ఆందోళనకు గురిచేస్తుందని అంటున్నారు. మరొక ట్విట్టర్ యూజర్.. '21 ఏళ్ల పిల్లవాడికి ఫోన్, ట్విట్టర్ వినియోగానికి సంబంధించి ఇలాంటి ఒప్పందాలు, సూచనలు కావాలని అభిప్రాయపడ్డాడు.

https://twitter.com/ManobalaV/status/1489091256303046658?s=20&t=uJU7km_bdV-HU4FDrTyk0A

Advertisement

Next Story