పరధ్యానం తగ్గించే మార్గాలు.. చిన్న టార్గెట్స్, షార్ట్ బ్రేక్స్‌తో ఎఫెక్టివ్ ఫలితాలు

by sudharani |
పరధ్యానం తగ్గించే మార్గాలు.. చిన్న టార్గెట్స్, షార్ట్ బ్రేక్స్‌తో ఎఫెక్టివ్ ఫలితాలు
X

దిశ, ఫీచర్స్ : ఓ వైపు పరీక్షలు దగ్గరపడుతున్నా.. చదవాల్సిన పోర్షన్ చాప్టర్ల కొద్దీ వెక్కిరిస్తున్నా.. ఇంకా రేపు మాపు అంటూ దాటవేస్తున్నారా? రోజువారీ టైమ్‌ టేబుల్‌‌ను పదే పదే మార్చుకుంటున్నారా? మీరే కాదు ప్రస్తుతం చాలా మంది విద్యార్థులు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. డిస్‌ట్రాక్షన్స్ కారణంగా చదువుపై ఫోకస్ చేయలేకపోవడం వంటి హ్యాబిట్యువల్ సైకిల్‌తో పోరాడుతున్నారు. ఇక ప్రస్తుత డిజిటల్ యుగం ఏకాగ్రతకు భంగం కలిగించే అనేక పరధ్యానాలతో నిండిపోయిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఫోన్ నోటిఫికేషన్స్ చెక్ చేయడం సహా సోషల్ మీడియా పేజీలను అదే పనిగా స్క్రోల్ చేయాలనే కోరికలే విలువైన సమయాన్ని కోల్పోవడానికి కారణమవుతున్నాయి. ఇలా సమయాన్ని వృథా చేయడమే అస్తవ్యస్తమైన పరధ్యానాల ముందు శక్తిహీనులుగా నిలబెట్టి లక్ష్య సాధనకు అడ్డుపడుతుంది. మరి ఈ వాయిదా అలవాటును ఎలా మార్చుకోవాలి?

సాధారణంగా డిస్‌ట్రాక్షన్ ఎదుర్కొంటున్నపుడు సౌకర్యంగాలేని, సవాల్‌గా లేదా రసహీనంగా కనిపించే ముఖ్యమైన పనులకు దూరంగా ఉండటంతో పాటు తరచూ తక్కువ ప్రాముఖ్యతగల పనులకు సమయం వెచ్చిస్తుంటారు. అందుకే వాయిదా వేయడాన్ని ఒక సమస్యగా గుర్తించాలి. ఇది మీ పూర్తి సామర్థ్యాన్ని వినియోగించకుండా చేస్తుంది. కాగా లక్ష్య సాధనలో ఆటంకం కలిగించే ఈ అలవాటును అధిగమించేందుకు, చదువుపై ఏకాగ్రత వహిస్తూ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు ఇక్కడ కొన్ని మార్గాలు ఇవ్వబడ్డాయి :

* అనుకూల వాతావరణాన్ని ఎంచుకోవాలి :

అనుకూల వాతావరణాన్ని సృష్టించుకోవడం ఏకాగ్రతను మెరుగుపరిచి, పరధ్యానాన్ని తగ్గించడంతో పాటు 'జెన్' మోడ్‌ సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి టీవీ, ఫోన్లు, టాబ్లెట్స్, ఇతర పరికరాలకు దూరంగా.. చదువుకోవడానికి సౌకర్యవంతమైన, ఆకర్షణీయమైన వాతావరణాన్ని గుర్తించాలి. ప్రతిసారి లేవాలనే కోరికను తగ్గించేందుకు అవసరమైన వస్తువులను అక్కడ అందుబాటులో ఉంచుకోవాలి. స్కూల్ వర్క్ చేస్తున్నపుడు కూడా ఎక్కడ కూర్చోవాలో, ఎవరితో కూర్చోవాలో తెలివిగా సెలెక్ట్ చేసుకోవాలి.

* చిన్న లక్ష్యాలను సెట్ చేసుకోవాలి :

పెద్ద టాస్క్‌లను చిన్న కార్యకలాపాలుగా విభజించడం ద్వారా సులభ లక్ష్యాలను సెట్ చేసుకోవాలి. చాప్టర్ మొత్తాన్ని ఒకేసారి అధ్యయనం చేయకుండా రోజుకొక కాన్సెప్ట్‌ను ఎంచుకుని, దానిపై 10-15 నిమిషాలు వెచ్చించాలి. సౌకర్యవంతంగా మారిన తర్వాత దానికి ఎక్కువ సమయం కేటాయించడం ద్వారా దినచర్యను రూపొందించుకోవాలి.

*షార్ట్ బ్రేక్స్ తీసుకోవాలి :

మల్టీ టాస్కింగ్ మానుకోవాలి. ఎందుకంటే ఇది మీ ఫోకస్‌ను దెబ్బతీస్తుంది. పరధ్యానాన్ని తగ్గించడానికి, చేతిలో ఉన్న ఒక పనిపై దృష్టి పెట్టడానికి 'పోమోడోరో టెక్నిక్' ఉపయోగించాలి. ఇందుకోసం 25 నిమిషాల చొప్పున టైమ్ స్లాట్స్ క్రియేట్ చేసుకోవాలి. దీని ప్రకారం టైమర్‌ సెట్ చేసుకుని అలారం మోగిన వెంటనే బ్రేక్ తీసుకోవాలి. ఇదే టెక్నిక్ కంటిన్యూ చేస్తూ మరింత శక్తితో పనిని పునఃప్రారంభించేందుకు గాను మైండ్ స్పేస్‌ను రీసెట్ చేసుకోవాలి.

* వాస్తవిక ప్రక్రియ లక్ష్యాలపై దృష్టిసారించాలి :

ప్రతిష్టాత్మకంగా ఉండటం మంచిదే కానీ అవాస్తవ అంచనాలతో అది మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తే ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. అందుకే సానుకూల, ఖచ్చితమైన, అర్ధవంతమైన లక్ష్యాలను ఏర్పరచుకోవడం ద్వారా ప్రిపరేషన్ ప్రారంభించాలి. మొత్తానికి అంతిమ లక్ష్యాలపై స్థిరపడకుండా అభ్యాస ప్రక్రియపై దృష్టిపెట్టాలి. ఉదాహరణకు : అంకగణిత ఖచ్చితత్వంపై పనిచేయడం కంటే గణితంలో 100 మార్కులు పొందడం గురించే ఎక్కువగా ఆందోళన చెందుతుంటే.. అది మీ మెదడుకు అసాధ్యమైన పనిగా కనిపిస్తుంది. కాబట్టి నేర్చుకునే ప్రాసెస్‌పైనే విశ్వాసం ఉంచాలి.

* శక్తివంతమైన సరిహద్దులు సెట్ చేసుకోవాలి :

సమయాన్ని గౌరవిస్తూ వాయిదా వేసే అలవాటును అధిగమించేందుకు బలమైన సరిహద్దులు సెట్ చేసుకోవాలి. మీ పరధ్యానానికి మూలాన్ని గుర్తించడం ద్వారా ఈ ప్రక్రియను ప్రారంభించాలి. ఉదాహరణకు : మీ పరధ్యానానికి సోషల్ మీడియానే మూలంగా భావిస్తే.. చదువుకోవడానికి కూర్చున్నప్పుడు అన్ని నోటిఫికేషన్స్‌ మ్యూట్ చేయాలి. ఇక ఫోన్, మెసేజెస్ మొదలైనవాటిని చెక్ చేసుకునేందుకు ప్రతి 2 గంటలకు ఒకసారి ప్రత్యేకంగా 15 నిమిషాలు కేటాయించాలి. ఇలాగైతే సమయం గంటల్లో కాకుండా నిమిషాల్లో వృథా అవుతుంది. ఇలా ఏం చేయకూడదో ఎంచుకుంటూ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించడం ద్వారా ఒక పనిని చేయడానికి ఉత్పాదక కారణాలపై దృష్టి పెట్టాలి.

Advertisement

Next Story

Most Viewed