మెదడు బలహీనంగా ఉందని సూచించే 5 లక్షణాలు.. గుర్తించకపోతే ప్రాణాలకే రిస్క్

by Anjali |
మెదడు బలహీనంగా ఉందని సూచించే 5 లక్షణాలు.. గుర్తించకపోతే ప్రాణాలకే రిస్క్
X

దిశ, ఫీచర్స్: మానవ శరీరంలో మెదడు అనేది ముఖ్యమైన అవయవం. వయోజన మానవ మెదడు సగటున 1.5 kg (3.3 lb)వెయిట్ ఉంటుంది. పురుషుల్లో సగటు బరువు 1370 అండ్ స్త్రీలల్లో 1200 గ్రాముల బరువు ఉంటుంది. మెదడు మానసిక, శారీరక ఆరోగ్యంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ఆలోచించడంతో, ఇతరులకు సలహాలు ఇవ్వడంలో బాగా పనిచేస్తుంది. మనం ఒక అడుగు ముందుకెయ్యాలన్నా మన మెదడుపైనే ఆధారపడి ఉంటుంది. ఇలాంటి మైండ్ సరిగా పనిచేయకపోతే పలు సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. ఈ ఐదు బలహీన లక్షణాలే మానసిక, శారీరక వ్యాధులు దరి చేరేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

సరైన నిద్ర లేకపోవడం..

మెదడు సరిగా పనిచేయకపోవడం వల్ల నిద్ర పట్టదు. ఇది మెదడు వీక్ ఉందని సూచిస్తుంది. నిద్ర లేకపోవడం వల్ల ఏ ఇతర పనుల మీద ఇంట్రెస్ట్ చూపించరు. ప్రతి చిన్న చిన్న విషయాలకు చాలా ఎమోషనల్ అవుతారు. ఆ సమయంలో ఆహారం కూడా తినాలనిపించదు.

పక్కవారిపూ చికాకు పడడం..

మెదడు బహీనంగా ఉందని సూచించడంలో చికాకు ఒకటి. రాత్రి నిద్రపోకవడం వల్ల ప్రవర్తనలో మార్పు వస్తుంది. మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. ఇతరులు దగ్గరకు వచ్చి మాట్లాడిన ఊరికే చికాకు పడుతారు. ఎవరితోనూ మాట్లాడటానికి ఇష్టపడరు. ఈ చికాకు వ్యాధి కనుక ఎక్కువ రోజులు ఉన్నట్లైతే తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుందంటున్నారు నిపుణులు.

మతిమరుపు రావడం..

మైండ్ సరిగా పనిచేయకపోతే మతిమరుపు వస్తుంది. ఇది కూడా మెదడు బలహీనంగా ఉందని సూచించినట్లే. బలహీనంగా ఉండటం వల్ల ప్రతి చిన్న విషయాన్ని కూడా మర్చిపోతుంటారు. దీంతో నిరాశ, ఒత్తిడి, ఇతర మానసిక సమస్యలు రావచ్చు.

వేగంగా బరువు తగ్గడం..

మెదడు బలహీనంగా ఉందని బరువు విషయంలో కూడా తెలుసుకోవచ్చు. బరువు వేగంగా తగ్గడమా? లేదా వేగంగా పెరగడమా? లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆకలి హార్మోన్లలో మార్పులు వస్తాయి. తరచూ ఏదోటి తినాలనిపిస్తుంది. లేకపోతే మొత్తమే ఆకలి వేయకపోవడం జరుగుతుంది.

ఒంటరితనం..

నిద్రలో పదే పదే మెలకువ రావడం మెదడు బలహీనంగా ఉందని సూచిస్తుంది. కొందరికి మొత్తమే నిద్రపట్టకపోవడం, విపరీతంగా ఆలోచించడం, ఒంటరితనం ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఎక్కువగా ఆలోచించడం వల్ల సమస్యలు ఎదుర్కునే సమయంలో కొంతమంది సూసైడ్ సూసైడ్ అటెంప్ట్ కూడా చేస్తారు. కాగా ఈ లక్షణాలు కనిపించినట్లైతే వెంటనే మానసిక వైద్యుడ్ని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే ప్రాణం నష్టపోతుందని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed