- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోషల్ మీడియా ట్రెండింగ్ చిట్కాలు.. ఆ 5 నిజంగానే పనిచేస్తాయట!
దిశ, ఫీచర్స్: అందం, ఆరోగ్యం, ఆలోచనలు ఇలా అన్ని విషయాలు పంచుకునే వేదికగా నేడు సోషల్ మీడియా ముందుంది. అయితే ఇక్కడ ట్రెండెంగ్‌లో ఉండే అంశాలన్నీ ఉపయోగకరమైనవేనా అన్న సందేహాలు కలుగుతుంటాయి. ఎందుకంటే పాపులారిటీ కోసం ఎవరు, ఏదైనా షేర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని విషయాలను నమ్మడానికి లేదు. ఒకవేళ మనం నమ్ముతున్నామంటే దానికి తగిన విశ్వసనీయత, ఆధారాలు ఉండాలి. లేదా నిపుణులు కన్ఫామ్ చేయాలి.
ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్, ఫేస్‌బుక్, టిక్‌టాక్ వంటి ప్రముఖ సోషల్ మీడియా వేదికల్లో స్కిన్ కేర్‌కు సంబంధించిన 5 విషయాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. అవి నిజంగానే పనిచేస్తాయని కూడా కొందరు డెర్మటాలజిస్టులు పేర్కొనడం, షేర్ చేయడం ఆసక్తిగా మారింది. ట్రెండింగ్‌లో ఉన్నప్పటికీ స్కిన్ నేచర్‌ని బట్టి కొన్ని చర్మ సంరక్షణ లేదా సౌందర్య ఉత్పత్తులు మేలు చేయకపోవవచ్చు.
అందుకే ప్రొడక్ట్ కంటెంట్‌ను చెక్‌చేయడం చాలా ముఖ్యమని, ఒకే సమయంలో మల్టిపుల్ ప్రొడక్ట్స్‌ను ట్రై చేయడం అస్సలు మంచిది కాదని స్కిన్ కేర్ నిపుణులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఆ 5 సౌందర్య చిట్కాలు, ఉత్పత్తులు నిజంగానే పనిచేస్తాయని చెప్తున్నారు. అవేంటో చూద్దాం.
Also Read.. శరీరంలో ఆ మార్పులు కనిపిస్తున్నాయా?.. అయితే మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
ఎల్‌ఈడీ మాస్క్‌లు
చర్మానికి ఎల్‌ఈడీ మాస్క్‌ల వాడకం ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండింగ్ ఉంది. ఫ్యూచరిస్టిక్‌గా కనిపించే ఈ మాస్క్‌లు స్కిన్ స్ట్రక్చర్‌ను మెరుగు పరుస్తాయి. మొటిమలను తగ్గిస్తాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి దోహదపడతాయి. వివిధ చర్మ సమస్యలను బట్టి ఇవి వేర్వేరు కలర్స్‌లలో ఉంటాయి. ఇవి హెల్తీ స్కిన్ గ్లోయింగ్ ఇస్తాయని, చర్మాన్ని దృఢంగా ఉంచుతాయని, ముడుతలు పోయి యవ్వనంగా కనిపించడంలో సహాయపడతాయని డెర్మటాలజిస్టు డాక్టర్ కపూర్ పేర్కొన్నారు.
ట్రెటినోయిన్
ట్రెటినోయిన్ అనేది టాపికల్ రెటినోయిడ్. ఇది చర్మ సౌందర్యాన్ని పెంచడమేగాక జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. చర్మం నిగనిగలాడేలా చేస్తుంది.
రోజ్‌మేరీ
రోజ్‌మేరీ హెయిర్ స్ప్రే తలకు రక్త ప్రసరణ పెరిగేలా చేయడంతోపాటు జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. దురదతో కూడిన స్కాల్ప్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చుండ్రును నివారిస్తుంది.
బోటాక్స్ ఇంజెక్షన్
ఇది స్ట్రెస్ రిలీఫ్ కోసం సహాయపడుతుంది. మనం ఆహారం నమలడానికి ఉపయోగపడే మస్సెటర్ కండరాలలో కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది. దంతాల గ్రైండింగ్(teeth grinding) వల్ల వచ్చే తలనొప్పిని తగ్గిస్తుంది.