కక్ష గట్టావా ఏంటి డాక్టరూ... ఒక్కసారే 23 పళ్లు ఎట్లా పీకేసావ్... మనిషి ఉంటాడా?

by Sujitha Rachapalli |
కక్ష గట్టావా ఏంటి డాక్టరూ... ఒక్కసారే  23 పళ్లు ఎట్లా పీకేసావ్... మనిషి ఉంటాడా?
X

దిశ, ఫీచర్స్ : చైనాకు చెందిన యోంగ్ కాంగ్ ఆగష్టు 14న దంత ప్రక్రియ జరిగినట్లు తన కూతురు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపింది. దేవే హాస్పిటల్ లో జరిగిన ఈ ప్రాసెస్ లో 23 దంతాలు పీకేసి.. 12 దంతాలు ట్రాన్స్ ప్లాంట్ చేశారు. ఇదంతా ఒకే రోజు జరిగింది. కానీ ఆ రోజు నుంచి పెయిన్ తో బాధ పడుతూనే ఉన్నాడని తెలిపింది. అకస్మాత్తుగా ఆగష్టు 28న తండ్రి గుండె పోటుతో మరణించినట్లు చెప్పింది. అగ్రిమెంట్ ప్రకారం తక్షణ పునరుద్ధరణ పద్ధతిని ఉపయోగించినట్లు వివరించింది. 'మా నాన్న ఇంత త్వరగా చనిపోతారని అనుకోలేదు. మేము కొన్న కొత్త కారు కూడా నడపలేదు' అని బాధపడింది.

ఇక ఈ పోస్ట్ వైరల్ కావడంతో విచారణ మొదలైంది. యాంగ్‌కాంగ్ మునిసిపల్ హెల్త్ బ్యూరో అధికారి మాట్లాడుతూ... "దంతాల వెలికితీత, అతని మరణానికి మధ్య రెండు వారాల గ్యాప్ ఉన్నందునా... మేము ఇంకా కారణాన్ని పరిశీలిస్తున్నాము" అన్నాడు. ఈ సంఘటన మొత్తం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పాడు. క్లినిక్ సిబ్బంది న్యూయార్క్ పోస్ట్‌తో మాట్లాడుతూ.. “ఈ విషయం మా న్యాయవాదికి అప్పగించబడినందున మేము ఇప్పుడు స్పందించము. ఏవైనా అప్డేట్స్ ఉంటే చెప్తాం'' అని తెలిపారు.

ఇక ఈ వార్త చదివిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ' ఒకే రోజులో 23 పళ్ళు తీసేసాడా? నేను ఒకేసారి రెండు జ్ఞాన దంతాలు తీయమని అడిగితేనే మా దంతవైద్యుడు నిరాకరించాడు ' అని ఒకరు కామెంట్ చేశారు. ' నేను దంతవైద్యుడిని, చాలా వదులుగా ఉంటే తప్ప ఒకేసారి మూడు కంటే ఎక్కువ పళ్ళు తీయను. డాక్టర్ కి మతిస్థిమితం తప్పింది. ఇది దంత ప్రక్రియ కంటే మానవ ప్రయోగంలా అనిపిస్తుంది" అని మరొకరు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story