పెరిగిన జీవిత బీమా సంస్థల ప్రీమియం వసూళ్లు!

by Harish |
పెరిగిన జీవిత బీమా సంస్థల ప్రీమియం వసూళ్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: లైఫ్ ఇన్సూరెన్స్ పరిశ్రమలో కొత్త వ్యాపార ప్రీమియం వార్షిక ప్రాతిపదికన 3 శాతం తగ్గి డిసెంబర్‌లో రూ. 24,383 కోట్లకు చేరుకుంది. 24 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల మొదటి ఏడాది ప్రీమియం 2019, డిసెంబర్‌లో రూ. 25,080 కోట్లుగా నమోదైంది. దేశీయ అతిపెద్ద జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ డిసెంబర్‌లో ఉత్పత్తి చేసిన ప్రీమియం 58 శాతంతో రూ. 14,346 కోట్లుగా నమోదైందని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌డీఏఐ) గణాంకాలు తెలిపాయి.

ప్రైవేట్ రంగ ఇన్సూరెన్స్ కంపెనీలు డిసెంబర్‌లో 22 శాతం వృద్ధితో రూ. 10,038 కోట్లతో కొత్త వ్యాపార ప్రీమియం వసూళ్లను నమోదు చేశాయి. వీటిలో ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ప్రీమియం 61 శాతం పెరిగి రూ. 514 కోట్లకు చేరుకుంది. మరో ఇన్సూరెన్స్ సంస్థ ఇండియా ఫస్ట్ 54 శాతం పెరిగి రూ. 240 కోట్లకు చేరుకుంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ కొత్త ప్రీమియం వ్యాపారం రూ. 1,469 కోట్లతో 32 శాతం పెరిగిందని, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ 27 శాతం వృద్ధితో రూ. 1,910 కోట్లు, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ 21 శాతం పెరిగి రూ. 768 కోట్లుగా నమోదయ్యాయి.

Advertisement

Next Story