2021-22లోగా సీఎఫ్ఓను నియమించనున్న LIC

by  |   ( Updated:2021-09-28 07:13:16.0  )
2021-22లోగా సీఎఫ్ఓను నియమించనున్న  LIC
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీఓ)కు రానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంస్థకు కొత్తగా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్ఓ)ను నియమించాలని భావిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో సంస్థలోని అత్యున్నత పదవి విషయంలో కీలక మార్పులు చేస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎల్‌ఐసీ చట్టం 1956లోని కొన్ని సవరణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఐపీఓకు ముందే సీఎఫ్ఓను నియమించనున్నారు. జూలై నాటి నోటిఫికేషన్ ప్రకారం.. ఎల్‌ఐసీ ఛైర్మన్‌ పదవిని చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా మార్చారు. ఎల్‌ఐసీ ఛైర్మన్‌ను సీఈవో అని వ్యవహరించనున్నారు.

కాగా, ఎల్‌ఐసీ ఐపీవో ద్వారా కేంద్రం భారీగా నిధులు సమీకరించనుంది. ఈ మేరకు కొన్ని నిబంధనలను సవరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి సంస్థలో 5-10 శాతం వాటాలను విక్రయించడం ద్వారా ప్రభుత్వం దాదాపు రూ. 80-90 వేల కోట్లను సేకరించనుంది.

Advertisement

Next Story