- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అక్టోబర్ తర్వాత ఎల్ఐసీ ఐపీఓ
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరెన్స్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) ఐపీవో ఈ ఏడాది అక్టోబర్ తర్వాత ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే, ప్రభుత్వ విమానయన సంస్థ ఎయిర్ ఇండియా, చమురు సంస్థ బీపీసీఎల్ వాటా అమ్మకాలు 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో పూర్తవుతుందని చెప్పాయి. సోమవారం నాటి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ ఐపీఓను నిర్వహించనున్నట్టు ప్రకటించారు.
అయితే, దీనికి ఎలాంటి గడువును పేర్కొనలేదు. అలాగే, బీపీసీఎల్, ఎయిర్ ఇండియా, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్, బీఈఎంఎల్, పవన్ హాన్స్ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణ 2021-22లోనే పూర్తవుతాయని చెప్పారు. సోమవారం బడ్జెట్‌తో పాటు సమర్పించిన ఆర్థిక బిల్లులో ఎల్ఐసీ, ఐడీబీఐ బ్యాంకులోని వాటా ఉపసంహరణకు అవసరమైన సవరణలను ప్రభుత్వ ప్రవేశపెట్టిందని ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్(దీపమ్) కార్యదర్శి తుహిన్ కాంత పాండే చెప్పారు.