- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్మార్ట్‌ఫోన్ తయారీకి ఎల్‌జీ గుడ్‌బై
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం, దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జీ తన మొబైల్‌ఫోన్ వ్యాపారం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు సంచలన ప్రకటన చేసింది. గత కొన్నేళ్లుగా భారీ నష్టాలు ఎదురవుతున్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 2013 సమయంలో దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలైన యాపిల్, శాంసంగ్ తర్వాత మూడో స్థానంలో అతిపెద్ద మొబైల్‌ఫోన్ తయారీ సంస్థగా ఎల్జీ నిలిచింది. కానీ, ఆ తర్వాత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో విపరీతమైన పోటీ, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ సమస్యలతో పాటు అప్‌డేట్‌లను అందించడంలో ఎల్జీ వెనకబడింది.
అదే సమయంలో చైనా కంపెనీలు మార్కెట్లో దూకుడు పెంచడంతో ఎల్‌జీ మనుగడకు ప్రమాదం ఏర్పడింది. సుమారు 6 ఏళ్లలో సుమారు రూ. 32,850 కోట్ల తీవ్రమైన నష్టాలను చూసిన ఎల్జీ.. తన వ్యాపారాన్ని వోక్స్‌వాహన్ ఏజీ, విన్‌గ్రూప్ జేఎస్‌సీ లాంటి బడా కంపెనీలకు విక్రయించాలని ప్రయత్నించింది. ఆ ప్రయత్నాలన్ని విఫలమవడంతో మొబైల్‌ఫోన్ తయారీ విభాగాన్ని మూసేయాలని నిర్ణయించింది. దీంతో స్మార్ట్‌ఫొన్ తయారీ నుంచి వైదొలగనున్న మొట్టమొదటి అతిపెద్ద కంపెనీగా ఎల్‌జీ నిలిచింది.