‘సోషలిస్టు సమాజ నిర్మాణమే పరిష్కారం’

by  |
‘సోషలిస్టు సమాజ నిర్మాణమే పరిష్కారం’
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖలో మావోయిస్టు ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో లేఖలు కలకలం రేపుతున్నాయి. మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో వ్యాక్సిన్లు, టీకాలు పరిష్కారం కావని లేఖలో పేర్కొన్నారు. సోషలిస్టు సమాజ నిర్మాణమే పరిష్కారం అని సూచించారు. ఏపీ, ఒడిశాలో కరోనా మృతులు విపరీతంగా పెరుగుతుంటే, కోలుకున్న వారి సంఖ్య పెరుగుతోందని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయని గుర్తు చేశారు. లాక్‌డౌన్‌లో పేద, మధ్య తరగతి ప్రజల కుటుంబాల జీవన విధానం అస్తవ్యస్థమైందని తెలిపారు.

అంతేగాకుండా ఉపాధి హామీ పనిలో భాగంగా ఏడాదికి 200 రోజులు పనిదినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డులు లేని వారికి వెంటనే ప్రభుత్వం నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పీహెచ్‌సీ ఏర్పాటు చేసి, అందులో వెంటిలేటర్ సదుపాయం కల్పించాలని అన్నారు. చివరగా… కరోనా నియంత్రణకు నియమాలు పాటిద్దాం…పెళ్లిళ్లు, పండుగలు, జాతర్లకు పరిమిత సంఖ్యలో హాజరు అవుదాం అని మావోయిస్టు ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ లేఖలో పేర్కొన్నారు.


Next Story

Most Viewed