- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల వివరాలివ్వండి
దిశ, న్యూస్‌బ్యూరో: గోదావరి నదీపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోన్న ప్రాజెక్టుల వివరాలు ఇవ్వాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు సభ్యుడు పీఎస్ కుటియాల్ తెలంగాణకు లేఖ రాశారు. ఇప్పటికే కృష్ణా బేసిన్లో తెలంగాణ ప్రాజెక్టుల వివరాలు, డీపీఆర్‌లు ఇవ్వాలని కృష్ణా బోర్డు తెలంగాణకు ఆదేశాలు జారీ చేసింది. ఇదే నేపథ్యంలో గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్నప్రాజెక్టుల వివరాలు, డీపీఆర్ లు ఇవ్వాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్‌కు లేఖ రాసింది. ఏపీ ఫిర్యాదులో పేర్కొన్న ప్రాజెక్టుల డీపీఆర్‌లు, వివరాలు ఇవ్వాలని బోర్డు కోరింది. కాళేశ్వరం ఎత్తిపోతలు, గోదావరి ఎత్తిపోతల మూడో దశ, సీతారామ ప్రాజెక్టు, తుపాకులగూడెం, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు, లోయర్ పెన్ గంగ బరాజ్‌లు రాజ్‌పేట, చనాఖా-కొరటా, పింపరాడ్-పర్సోడా, రామప్ప నుంచి పాకాలకు గోదావరి నీళ్ల మళ్లింపు ప్రాజెక్టుల వివరాలు, డీపీఆర్లను బోర్డుకు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం మొదలైన నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఏపీ కూడా తెలంగాణ ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదులపై నిర్మాణం చేస్తున్న ప్రాజెక్టులు అక్రమమని, రెండు బోర్డులకు సరైన వివరాలు, డీపీఆర్‌లు చూపించకుండా నిర్మాణం చేస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది. ఈ పరిణామాల్లో కృష్ణా బోర్డు మంగళవారం తెలంగాణకు లేఖ రాసింది. కృష్ణా నదిపై నిర్మిస్తున్నప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు, డీపీఆర్‌లను ఇవ్వాలని లేఖలో ఆదేశించింది. మరోవైపు బుధవారం గోదావరి బోర్డు కూడా తెలంగాణకు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ ప్రభుత్వం గోదావరి బోర్డుకు చేసిన ఫిర్యాదుల్లో పలు ఆరోపణలు చేసింది. కాళేశ్వరం నుంచి 225టీఎంసీలకు బదులుగా 430టీఎంసీలను వాడుకుంటున్నారని, సీతారామ ఎత్తిపోతల నుంచి 70 టీఎంసీలకు బదులు 100 టీఎంసీలను వినియోగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. అపెక్స్ కౌన్సిల్‌లో నిర్ణయం తీసుకోకుండా… బోర్డుకు సమాచారం కూడా ఇవ్వకుండా గోదావరి జలాల వినియోగం చేస్తున్నారని, గతేడాది ఆగస్టులో జరిగిన గోదావరి బోర్డు సమావేశంలో తెలంగాణ ప్రాజెక్టులు, నీటి వాడకంపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వివరించారు. ఈ నేపథ్యంలోనే గోదావరి బోర్డు తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది.