- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘ఆ పోలీసులను ఏ సజ్జల వచ్చికాపాడతాడో చూస్తాం’
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు తాలిబన్‌ల మాదిరిగా పని చేస్తున్నారని విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన తాము కూడా అధికారంలో ఉన్నామని.. ఏ రోజు పోలీసు సిబ్బందితో ఇలాంటి పనికిమాలిన పనులు చేయించలేదని మండిపడ్డారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలపైనే దాడులు చేస్తుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని నిలదీశారు. వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అట్రాసిటీకి ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.
అట్రాసిటీ చట్టాన్ని ఎత్తివేయించేందుకు జగన్ కుట్ర పన్నారంటూ విరుచుకుపడ్డారు. టీడీపీ నేతలు పరామర్శిస్తుంటే వైసీపీ నేతలను పోలీసుల ఎలా తీసుకువస్తారని నిలదీశారు. అధికార పార్టీ నేతల వద్ద మార్కులు కొట్టేందుకు పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టే పోలీసులపై ప్రైవేట్ కేసులు పెడతామని..అప్పుడు ఈ అధికారులను ఏ సజ్జల వచ్చి కాపాడతాడో చూస్తామని హెచ్చరించారు. మరోవైపు గుంటూరు జిల్లాలో పేకాట, గుట్కా, మద్యం విచ్చలవిడిగా సాగుతుందని…జిల్లా పోలీసులు, అధికారుల అవినీతిలో కూరుకపోయి పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర స్థాయి పోలీసు అధికారి వచ్చి పేకాట శిబిరాలపై దాడులు చేయడం జిల్లా పోలీసులకు సిగ్గు చేటని మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు.