- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
20 జిల్లాల్లో పదిలోపే కరోనా కేసులు
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ర్టంలో కరోనా కేసులు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. వైరస్ తీవ్రత తగ్గడంతోనే పాజిటివిటీ తగ్గుతున్నదని ఆరోగ్యశాఖ చెబుతున్నది. 6 జిల్లాల్లో కేసుల సంఖ్య జీరో తేలగా, మరో 20 జిల్లాల్లో కేవలం పదిలోపు కేసులు నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ ఆదివారం కరోనా బులిటెన్‌లో పేర్కొన్నది. ప్రస్తుతం నాలుగైదు ప్రాంతాల్లోనే వైరస్ తీవ్రత స్వల్పంగా ఉన్నదని, దాన్ని కూడా పూర్తిగా తగ్గించేందుకు కృషి చేయాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకులు డాక్టర్ జి. శ్రీనివాసరావు మెడికల్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. కేసులు తేలుతున్న ప్రాంతాల్లో టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ విధానాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలన్నారు. ఆ ప్రాంతాల నుంచి వేరే చోటుకు వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
కొత్తగా మరో 249 మందికి వైరస్ ..
రాష్ర్ట వ్యాప్తంగా మరో 249 మందికి వైరస్ తేలగా, ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. కొత్తగా ఆదిలాబాద్‌లో 1, భద్రాద్రి కొత్తగూడెం 4, జీహెచ్ఎంసీలో 82, జగిత్యాల 5, జనగామలో 6, భూపాలపల్లిలో 1, కరీంనగర్‌లో 11, ఖమ్మంలో 12, ఆసీఫాబాద్‌లో 1, మహబూబ్ నగర్‌లో 6, మహబూబాబాద్‌లో 2, మంచిర్యాలలో 6, మెదక్‌లో 2, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 17, నాగర్ కర్నూల్ 1, నల్గగొండలో 18, నిజామాబాద్‌లో 6, పెద్దపల్లిలో 4, రాజన్నసిరిసిల్లలో 3, రంగారెడ్డిలో 13, సంగారెడ్డిలో 6, సిద్ధిపేట్‌లో 5, సూర్యాపేట్ 7, వనపర్తిలో 3, వరంగల్ రూరల్‌లో 9, వరంగల్ అర్బన్‌లో 14, యాదాద్రి భువనగిరిలో 4 కేసులు నమోదయ్యాయి.