- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వలలో చిక్కిన చిరుత మృతి
by Shyam |
దిశ, నల్గొండ: నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం రాజపేట తండాలో గురువారం అడవి పందుల కోసం రైతులు పెట్టిన ఉచ్చులో చిరుతపులి చిక్కిన సంగతి తెలిసిందే. దీంతో పశువైద్య సహాయకుడు డాక్టర్ అసదుల్లా, నెహ్రూ జూలాజికల్ పార్క్ డిప్యూటీ డైరెక్టర్ ఎంఏ హకీమ్ నేతృత్వంలో రెస్క్యూ టీమ్ రసాయన దాడి చేసి చిరుతను సురక్షితంగా రక్షించారు. అనంతరం రాజపేట తండా నుంచి హైదరాబాద్‌లోని జూ పార్కుకు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. దీంతో చిరుతకు పోస్టుమార్టం నిర్వహించారు. అంతర్గత రక్తస్రావంతో పాటు వేడిమి, షాక్, అస్పిక్సియా వంటి కారణాలతో చిరుత మృతి చెందిందని వైద్యుల బృందం తేల్చింది. సమగ్ర దర్యాప్తు కోసం దీని నమూనాలను శాంతినగర్‌లోని వీబీఆర్ఐకి పంపనున్నట్టు అధికారులు చెప్పారు.
Advertisement
Next Story