గేదెల దాడి.. 18 రోజుల్లో ప్రాణాలు కోల్పోయిన చిరుత

by Sumithra |
గేదెల దాడి.. 18 రోజుల్లో ప్రాణాలు కోల్పోయిన చిరుత
X

దిశ ప్రతినిధి, మహబూబ్‎నగర్: గేదెల దాడిలో తీవ్రంగా గాయపడిన చిరుత పులి మరణించింది. హైదరాబాదులోని జూ పార్క్‌లో 18 రోజుల పాటు మృత్యువుతో పోరాడి మంగళవారం మృతి చెందిందని జిల్లా అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం బూరుగుపల్లిలో చిరుత హల్ చల్ చేసింది. గ్రామంలోని నవాజ్ రెడ్డి అనే రైతుకు సంబంధించిన గేదెలపై ఆకస్మికంగా దాడికి పాల్పడింది. ఇదే సమయంలో చిరుతపై ఒక్కసారిగా ఎదురుదాడి చేసిన గేదెలు కొమ్ములతో పొడిచి.. వెన్నెముకను విరగొట్టాయి. ఈ నేపథ్యంలోనే తీవ్రంగా గాయపడిన చిరుతను అటవీశాఖ అధికారులు హైదరాబాద్‌లోకి జూ పార్కుకు తరలించారు. చిరుత ప్రాణాలను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని అధికారులు, వైద్యులు తెలియజేశారు. చిరుత మరణించిందని తెలియగానే బూరుగుపల్లి గ్రామస్తులు అయ్యో పాపం అంటూ మానవత్వం చూపించారు.

Advertisement

Next Story

Most Viewed