మెదక్‌‌లో చిరుత సంచారం.. బంధనం

by Shyam |
మెదక్‌‌లో చిరుత సంచారం.. బంధనం
X

దిశ, మెదక్: జిల్లాలోని చిన్న శంకర్‌పేట్ మండలం గజగట్లపల్లిలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన మంద దుర్గయ్య పొలంలో చిరుత దాడిలో మృతిచెందిన కుక్కను రైతులు గమనించి, అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు కుక్క శరీరంపై ఉన్న గాట్లను పరిశీలించి చిరుతనే దాడి చేసిందని ధ్రువీకరించారు. అనంతరం చిరుతను అధికారులు బంధించడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

tag: Leopard, dog, attack, medak, ts news

Advertisement

Next Story