- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అర్ధరాత్రి గొర్రెలపై చిరుత దాడి.. ఆందోళనలో గ్రామస్తులు
దిశ, అచ్చంపేట/ ఉప్పునుంతల : నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో గల ఉప్పునుంతల మండల కేంద్రంలో ఆదివారం రాత్రి చిరుతపులి సంచరించింది. గ్రామానికి చెందిన ఒక రైతు వ్యవసాయ పొలంలో గల దొడ్డిలో చిరుత దాడి చేసి మూగజీవాలను హతమార్చిన సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు బాధిత రైతు తెలుపుతున్న సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
నాలుగు గొర్రెలు దూడ మృతి
ఉప్పునుంతల మండల కేంద్రానికి చెందిన రైతు మేడమోని ఆంజనేయులు వ్యవసాయ పొలంలో గల దొడ్డి వద్దకు సోమవారం ఉదయం వెళ్లి చూడగా దొడ్డిలో గొర్రెలు చనిపోయాయని తెలిపారు. దొడ్డిలో, వ్యవసాయ పొలంలో కనిపిస్తున్న జాడలను బట్టి చిరుత పులి ఆదివారం రాత్రి దాడి చేసి ఉంటుందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో 4 గొర్రెలు, గేదె దూడ మృతి చెందిందని అలాగే ఆవుకు గాయాలు అయ్యాయి అని తెలిపారు. చిరుత పులి దాడి చేసిన సంఘటనలో బాధిత రైతుకు సుమారు 60 వేల ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపాడు. కావున సంబంధిత అధికారులు బాధిత రైతులను ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఇదే మండలంలో గత వారం రోజుల క్రితం మర్రిపల్లి గ్రామంలో కూడా చిరుత పులి సంచరించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆందోళనలో మండల ప్రజలు…
వారం పదిరోజుల్లో మండలంలో రెండు చోట్ల చిరుతపులి సంచారం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతుడడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా చిరుతపులి సంచారం జరుగుతుందా ? గొర్రెల, పశువుల దొడ్డిపై దాడులు చేస్తున్నది చిరుతపులే నా ? ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం అటవి శాఖ అధికారులపై ఉందని, మండల ప్రజలు కోరుతున్నారు.
అటవీశాఖ అధికారి మనోహర్…
పై సంఘటనపై అచ్చంపేట అటవీశాఖ అధికారి మనోహర్‌ను దిశా ఫోన్ ద్వారా వివరణ కోరగా తాను మాట్లాడుతూ… వ్యవసాయ పొలంలో దొడ్డిలో కనిపిస్తున్న జాడలను బట్టి చిరుతపులి కాదనిపిస్తున్నది, గ్రామ కుక్కలు దాడి చేసి ఉంటాయని, అనుమానం వ్యక్తం చేశారు. చిరుతపులి ఈ ప్రదేశంలో సంచరించడానికి అవకాశాలు లేవని, ఉప్పునుంతల మండల లో చోటుచేసుకున్న సంఘటనపై సంబంధించి పూర్తి సమాచారం కోసం మా సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించాలని సూచించామని ఆయన తెలిపారు.