- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెన్నిస్‌కు అండగా లెజెండ్స్..
ప్రస్తుతం టెన్నిస్ క్రీడారంగంలో దిగ్గజాలంటే ఆ ముగ్గురే.. ప్రపంచంలో ఎక్కడ టెన్నిస్ ఈవెంట్లు జరిగినా ఆ ముగ్గురిలో ఒకరు ఆడుతున్నారంటే చాలు.. ఎక్కడ లేని క్రేజ్ వస్తుంది. ఆటకు అందం, ఆకర్షణ తీసుకురావడమే కాదు.. ఆట ద్వారా ఎంతో పేరు, డబ్బును సంపాదించారు. వాళ్లే ‘రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్, నోవాక్ జకోవిచ్.’ ప్రస్తుతం ప్రపంచ పురుషుల టెన్నిస్‌లో వీరి ముగ్గురిదే హవా. కరోనా కారణంగా టెన్నిస్‌కు ఆయువు పట్టయిన వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ వంటి గ్రాండ్ స్లామ్ టోర్నీలన్నీ రద్దయ్యాయి. ఈ తరుణంలో.. ప్రపంచమంతా తమను గుర్తించేలా చేసిన టెన్నిస్ ఆటను బతికించుకునేందుకు ఇప్పుడు ఈ ముగ్గురు లెజెండ్స్ ముందుకొచ్చారు. కరోనా సంక్షోభంతో నష్టపోయిన టెన్నిస్ క్రీడ అభివృద్ధికి నడుం బిగించారు. ఇప్పటికే ఈ విషయాన్ని రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించినట్లు సెర్బియా ప్లేయర్ నోవాక్ జకోవిచ్ తెలిపాడు. ఆదివారం సహ క్రీడాకారుడు వావ్రింకాతో జరిపిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో దీనికి సంబంధించిన పలు విషయాలు వెల్లడించాడు.
కరోనా తర్వాత టెన్నిస్ క్రీడ ఎలా ఉండబోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో దిగువ ర్యాంకుల క్రీడాకారులు నష్టపోవడంపై చర్చించినట్లు చెప్పారు. ముఖ్యంగా 250 నుంచి 700 ర్యాంకుల క్రీడాకారులు టెన్నిస్‌ను విడిచిపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసిందని, వారికి ఈ క్లిష్ట సమయంలో తోడ్పాటు అందించాలని నిర్ణయించినట్లు జకోవిచ్ తెలిపారు. ఇందుకోసం ‘అందరూ కలిసి 4.5 మిలియన్ డాలర్లు నిధులు సేకరించాలని నిర్ణయించామని, త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి విషయాలను ముగ్గురం కలిసి వెల్లడిస్తామని’ అన్నారు.
Tags :Roger Federer, Rafael Nadal, Jakovich,Tennis, Grand Slams