అనాథ వృద్ధురాలికి న్యాయ సేవాధికార సంస్థ బాసట

by Shyam |
Oldage Home
X

దిశ, తెలంగాణ బ్యూరో: భర్త చనిపోవడం.. పిల్లలు వదిలేయడంతో అనాథగా మారి నిరాశ్రయురాలైన సుశీలమ్మ అనే వృద్ధురాలిని తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అక్కున చేర్చుకుంది. ఆమె దీనావస్థ గురించి ఓ దినపత్రికలో ప్రచురితమైన వార్తకు సిటీ సివిల్ కోర్ట్ న్యాయ సేవాధికార సంస్థ స్పందించింది. బాధిత వృద్ధురాలికి అండగా నిలిచి మదర్ ధెరిసా వృద్ధాశ్రమంలో చేర్పించింది.

ఈ విషయాన్ని సిటీ సివిల్ కోర్టు న్యాయసేవాధికార సంస్థ దృష్టికి సంస్థ సభ్య కార్యదర్శి అనుపమ చక్రవర్తి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తీసుకొచ్చారు. వెంటనే వృద్ధురాలి దగ్గరికి సిటీ సివిల్ కోర్టు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.మురళీమోహన్ తమ పారా లీగల్ వాలంటీర్లను పంపించారు. ఆహారం, ఆశ్రయం కల్పించడానికి ఏర్పాట్లు చేశారు. వృద్ధురాలు హోంలో ఉండటానికి సిద్ధపడక పోవడంతో రెండో రోజు కూడా న్యాయసేవాధికార సంస్థ కౌన్సెలింగ్ నిర్వహించింది.

వృద్ధురాలిని మంగళవారం సికింద్రాబాద్ బోయిగూడలోని నిర్మల్ హృదయ్ మదర్ థెరిసా హోంలో చేర్పించారు. కార్యక్రమంలో సిటీ సివిల్ కోర్టు న్యాయసేవాధికార సంస్థ వాలంటీర్లు పీఎల్వీ లు దయాకర్ రావు, బి.సురేష్ కుమార్, ప్రమోద్ కుమార్, మెట్రోపాలిటన్ లీగల్ సర్వీస్ అథారిటీ పారా లీగల్ వాలంటీర్ రమేష్, గాంధీనగర్ పోలీసులు పాల్గొన్నారు.

Advertisement

Next Story