జమ్మూకాశ్మీర్ అభివృద్ధే నా ధ్యేయం

by Shamantha N |
జమ్మూకాశ్మీర్ అభివృద్ధే నా ధ్యేయం
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ అభివృద్ధే తన ప్రధాన ధ్యేయమని లెఫ్ట్ నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అన్నారు. శుక్రవారం ఆయన నూతన బాధ్యతలు స్వీకరించారు. రాజ్యాంగం ప్రసాదించిన అధికారాలను ప్రజల సంక్షేమం కోసమే వినియోగిస్తానని, ఎవరిపై పక్షపాతం చూపనని సిన్హా వెల్లండిచారు. ప్రజల నిజమైన అవసరాలను వినడానికి తాను అన్నివేళలా సిద్ధంగా ఉంటానని, వాటికి పరిష్కార మార్గాలు చూపిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

అంతేకాకుండా, జమ్మూ కశ్మీర్ భారత్‌కు స్వర్గం లాంటిదని, ఆ స్వర్గంలో విధులు నిర్వర్తించే అవకాశం తనకు రావడం సంతోషంగా ఉందన్నారు.ఆగస్టు 5వ తేదీ చాలా ప్రాముఖ్యం కలిగిన రోజని, జమ్మూకశ్మీర్ ప్రధాన జనజీవన స్రవంతిలో కలిసిన రోజని పేర్కొన్నారు. చాలా ఏండ్ల తర్వాత కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, వాటిని పూర్తి చేయడమే తన ముందున్న లక్ష్యమని మనోజ్ సిన్హా ప్రకటించారు.

Advertisement

Next Story