ఇకపై పల్లెల్లో ఎల్‌ఈడీ కాంతులు..

by Shyam |
ఇకపై పల్లెల్లో ఎల్‌ఈడీ కాంతులు..
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎల్ఈడీ వెలుగులు నింపాలని తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(టీఎస్ఆర్ఈడీసీఓ)కు ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ విభాగం ఆదేశాలు జారీచేసిందని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, కేంద్రీకృత కమాండ్ పర్యవేక్షణ వ్యవస్థ, ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు వంటి అంశాలకు కావాల్సిన నిధులు రూ.298 కోట్లకు ఈ టెండరింగ్ విధానంలో బిడ్డింగ్ వేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ-టెండరింగ్ పోర్టల్ ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిశీలనలోకి తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్టు విలువ భారీ మొత్తంలో ఉన్నందున పర్యవేక్షణకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని టీఎస్ఆర్ఈడీసీఓ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Next Story