- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీడిన వాటర్ ట్యాంక్ డెడ్ బాడీ మిస్టరీ
దిశ, అంబర్‌పేట్: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన వాటర్ ట్యాంక్‌లో డెడ్ బాడీ కేసు మిస్టరీ వీడింది. మృతదేహం గుర్తు పట్టకుండా మారడం, వాటర్ ట్యాంక్ మూత వేసి ఉండటంతో అందరూ ఈ కేసును హత్యగా భావించారు. అయితే ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
చిక్కడపల్లిలోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన కిషోర్ (25) స్థానికంగా పేయింటింగ్ వర్క్స్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కిషోర్ మద్యానికి బానిసగా మారి.. నిత్యం కుటుంబ సభ్యులతో గొడవ పడుతుండేవాడు. ఇలాగే నవంబర్ 19న తల్లిదండ్రులతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. రాత్రి అయినా కిశోర్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధు, మిత్రుల వద్ద వెతికారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.
అయితే మనస్తాపం చెందిన కిశోర్.. మద్యం మత్తులో రీసాలగడ్డ వాటర్ ట్యాంక్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.15 రోజుల తర్వాత వాటర్ వర్క్స్ సిబ్బంది ట్యాంక్‌ను శుభ్రం చేయడానికి వెళ్లడంతో ఘటన వెలుగుచూసింది. మృతుడు వేసుకున్న దుస్తులను బట్టి కిషోర్‌గా కుటుంబ సభ్యులు గుర్తించారని పోలీసులు వెల్లడించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.