- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బయటపడిన 250 నగ్న వీడియోలు.. అందులో 100 బాలీవుడ్ తారలవే..
దిశ, వెబ్‌డెస్క్: నేటి అత్యాధునిక టెక్నాలజీ మంచికంటే ఎక్కువగా చెడుకు వినియోగిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పరిచయమై ఎంతో మంది జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తున్నారు కొందరు. ఈ మధ్యనే నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా వ్యవహారం బాలీవుడ్‌ను కుదిపేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ముంబై సైబర్ సెల్ డీసీపీ రష్మికరందికర్ తెలిపిన వివరాల ప్రకారం.. వివిధ రాష్ట్రాలకు చెందిన 5 గురు వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడి సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశారు. ఆ ఫేక్ అకౌంట్లతో చాటింగ్ చేసి యువతులను ట్రాప్ చేసేవారు. పూర్తి విశ్వాసం వచ్చిన తరువాత న్యూడ్‌గా చాట్ చేసే క్రమంలో ఆ వీడియోలను రికార్డ్ చేసేవారు.
యువకుడిని మత్తులోకి దింపిన ఒకే అమ్మాయి.. మూడు గొంతులు, మూడు పాత్రలు!
ప్రభుత్వ వైద్యుడి పైశాచికత్వం.. బాతురూంలో నర్స్ నగ్న వీడియోలు తీసి.
ఇంకేముంది రికార్డు చేసిన ఆ నగ్న వీడియోలను అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసేవారి తెలిపారు. ఈ ముఠా 258 మందిని లక్ష్యంగా చేసుకొని ఈ వ్యవహరం కొనసాగించినట్లు ఆమె వెల్లడించారు. అంతేకాకుండా వీరి వలలో దాదాపు 100 మంది బాలీవుడ్‌కు చెందిన సినీతారలు, టీవీ తారలు, మోడల్స్ ఉన్నట్లు తెలిపారు. కానీ వారికి సంబంధించిన వివరాలు ఆమె వెల్లడించలేదు. ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు జూన్ 5వ తేదిన కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించామని ఆమె తెలిపారు. దర్యాప్తులో ఈ సెక్స్‌టార్షన్ రాకెట్ ముఠా గుట్టు బయట పడిందని ఆమె పేర్కొన్నారు.
ఇప్పటికే 250 వీడియో క్లిప్‌లను సుమారు 80 మందికి అమ్మినట్లు విచారణలో తేలిందన్నారు. వీడియోల అమ్మకం ద్వారా వచ్చిన రూ.30 లక్షలను డిపాజిట్ చేయడానికి నేపాల్ బ్యాంక్‌లో ఓ ఖాతాను తెరిచినట్లు తెలుస్తోందని వెల్లడించారు. తెలియని వారివద్ద నుండి వచ్చిన కాల్స్, సోషల్ మీడియా సందేశాలను నమ్మవద్దని, ప్రజలు చైతన్యవంతగా ప్రవర్తించాలన్నారు డీసీపీ రష్మికరందికర్.