- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్: ప్రముఖ జర్నలిస్టు TNR ఇకలేరు
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ జర్నలిస్టు, పలు సినిమాల్లో నటించిన TNR(తుమ్మల నర్సింహా రెడ్డి) కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ TNR అనే ప్రోగ్రామ్ ద్వారా ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు క్రీడాకారులను సైతం ఇంటర్వ్యూలు చేసిన టీఎన్ఆర్, జర్నలిజంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆయన మరణ వార్త తెలిసిన తెలుగు మీడియా ప్రతినిధులు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. అంతేగాకుండా ఆయనలేని లోటు తీర్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. కాగా, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి చర్యలు తీసుకున్నా.. ఫలితం లేకుండా పోతోంది. దీంతో ప్రజలే అవగాహన కల్పించుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.