ప్రముఖ గాయకుడికి రోడ్డు ప్రమాదం

by Anukaran |   ( Updated:2020-11-03 10:39:41.0  )
ప్రముఖ గాయకుడికి రోడ్డు ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: లెజెండ‌రీ సింగ‌ర్ యేసుదాసు కుమారుడు, ప్రముఖ గాయ‌కుడు విజ‌య్ యేసుదాసు రోడ్డు ప్ర‌మాదానికి గుర‌య్యాడు. ఈ ఘటన కేర‌ళ‌లోని అల‌ప్పుజ జిల్లాలో థ‌రువూర్ వ‌ద్ద సోమ‌వారం రాత్రి జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరువనంతపురం నుంచి కొచ్చికి తన స్నేహితుడితో కలిసి అర్ధరాత్రి తన కారులో స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుండగా.. జాతీయ రహదారిపైకి అకస్మాత్తుగా మరో కారు దూసుకొచ్చింది. దాంతో ఒక్క క్షణంలోనే కంట్రోల్ కోల్పోయిన విజయ్ కారును ఎదురుగా వచ్చిన కారు ముందు భాగంలో బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో విజయ్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకోని విచారణ చేపట్టారు.

Advertisement

Next Story