తెలంగాణ సింగర్ కన్నుమూత.. సీఎం కేసీఆర్ సంతాపం

by Shyam |
singer Jai Srinivas
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చలనచిత్ర పరిశ్రమను కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకూ విజృంభిస్తూ అనేకమంది ప్రముఖులను పొట్టనబెట్టుకుంటోంది. తాజాగా.. ప్రముఖ తెలంగాణ గాయకుడు జై శ్రీనివాస్ కరోనాతో కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన సికింద్రాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ‘జై’ సినిమాలోని ‘‘దేశం మనదే.. తేజం మనదే.. ఎగురుతున్న జండా మనదే’’ అనే పాటతో ప్రాచుర్యం పొందిన నేరేడుకొమ్మ శ్రీనివాస్(అలియాస్ జై శ్రీనివాస్) మృతిపట్ల తెలుగు ఇండస్ట్రీలోని ప్రముఖులను తీవ్ర దిగ్భ్రాతికి గురిచేసింది. టాలీవుడ్‌లో అనేక సూపర్ హిట్ సిమాలకు శ్రీనివాస్ ఎన్నో పాటలు పాడారు. సినిమా పాటలతోనే కాకుండా.. ప్రైవేట్ ఆల్బమ్‌లకు, షార్ట్ ఫిలింలకు, వెబ్ సిరీస్‌లకు పాటలు పాడారు. అలాగే దేశ భక్తి పాటలు కూడా పాడి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం

ప్రముఖ తెలంగాణ సింగర్ నేరేడుకొమ్మ శ్రీనివాస్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. శ్రీనివాస్ మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకే కాకుండా, తోటి సింగర్‌లకు తీరనిలోటని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed