తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

by Sumithra |   ( Updated:2021-12-28 08:16:03.0  )
Baludu11
X

దిశ, ఎల్బీనగర్: తప్పిపోయిన బాలుడిని చేరదీసిన ఎల్బీనగర్ పోలీసులు ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. మంగళవారం కర్ణాటక రాష్ట్రం బీదర్ కు చెందిన ఏడేళ్ల బాలుడు నిత్యానాథ్ తల్లిదండ్రులు ఎల్బీనగర్ శ్రీనివాస నగర్ కాలనీలో ఉంటున్న బంధువుల ఇంటికి వచ్చారు. అయితే నిత్యానాథ్ ఆడుకుంటూ జనప్రియ కాలనీ రాక్ టౌన్ వరకు వచ్చాడు. ఇంటికి ఎలా వెళ్లాలో తెలియక ఏడుస్తూ ఉండడంతో పోలీసుల కంటపడ్డాడు. వెంటనే పోలీసులు అతన్ని చేరదీశారు. ఆచూకీ చెప్పలేకపోవడంతో పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. అనంతరం ఎస్ఐ సైదులు, కానిస్టేబుల్ బాలాజీ బాలుడి బంధువులు శ్రీనివాస నగర్ కాలనీలో ఉన్నట్లు గుర్తించారు. వారిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి నిత్యనాథ్ ను తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన ఎస్ఐ సైదులు, కానిస్టేబుల్ బాలాజీలను ఎల్బీనగర్ సీఐ అశోక్ రెడ్డి అభినందించారు.

Advertisement

Next Story