- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వామన్‌రావు మర్డర్ ‘మిస్టరీ’.. అంబులెన్స్‌లో ఏం జరిగింది..?
లాయర్ వామన్‌రావు దంపతుల హత్య కేసు రోజుకో మలుపుతిరుగుతున్నా.. మర్డర్ మిస్టరీ మాత్రం వీడటం లేదు. కేసు విచారణలో పోలీసులు పలు విషయాలను విస్మరించారని ఆరోపణలు వస్తున్నాయి. మర్డర్ జరిగిన తరువాత ఆస్పత్రికి ఎప్పుడు తరలించారు.. అంబులెన్స్‌లో ఏం జరిగింది.. అందులో ఎటువంటి చికిత్స అందించారు.. అసలు వాస్తవాలు ఏంటనేది మిస్టరీగా మిగిలింది..!
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఫిబ్రవరి 17, 2021 మధ్యాహ్నం 2.30 గంటలకు పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్వచర్ల వద్ద వామన్‌రావు, పీవీ నాగమణిలను బ్రతికి ఉండగా చూశారని పోలీసులు పంచనామా రిపోర్టులో రాశారు. తిరిగి 3.30 గంటలకు చనిపోయిన తరువాత మొట్టమొదటగా చూసిన వ్యక్తుల గురించి పోలీసులు వివరంగా రాశారు. అయితే, అక్కడ కల్వచర్ల నుండి 15 కిలోమీటర్ల దూరం ఉండే పెద్దపల్లికి అంబులెన్స్‌లో తరలించింది ఎప్పుడు ? అందులో ఎలాంటి చికిత్స అందించారు? ఆసుపత్రికి తరలించిన తరువాత ఏం జరిగింది..? అన్నదానిపై క్లారిటీ లేదు.
శ్రీధర్ బాబు చెప్పింది నిజమేనా..?
హత్య జరిగిన రోజు పెద్దపల్లి ఆస్పత్రికి చేరుకున్న మాజీ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ విషయంపై మండిపడ్డారు. వామన్‌రావు దంపతులను ఆసుపత్రికి తరలించడంలో నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేయగా.. పోలీసులు అధికారులు సమాధానం ఇస్తూ ‘రామగిరి ఎస్సై వారిని తీసుకోచ్చారని’ చెప్పారు. అనుమానాలు ఉన్న ఆయన్ని పంపించారంటే మార్గమధ్యలో ఏమైనా చేసి ఉండవచ్చని శ్రీధర్ బాబు ఆరోపించారు. పోలీసు అధికారులు రాసి ఇచ్చిన పోస్టు మార్టం రిపోర్ట్‌ను పరిశీలిస్తే కూడా శ్రీధర్ బాబు అనుమానాలు నిజమే అన్నట్టుగా ఉన్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసులో ఆచితూచి వ్యవహరించాల్సిన పోలీసుల విచారణలో డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. సాంకేతికంగా ప్రతి అంశాన్ని, నిందితులను పరిశీలించినా.. కేసు వీగిపోయేందుకు కోర్టులో అడ్వకేట్స్ ద్వారా వాదించే అవకావం ఉంటుంది. అంతేకాకుండా ఈ హత్య తరువాత హైకోర్టు న్యాయవాదులు కూడా ప్రత్యేక దృష్టి సారించారు. అయినప్పటికీ పోలీసులు కొన్ని అంశాలను విస్మరించడం గమనార్హం.
వామన్‌రావు, నాగమణిలను కల్వచర్ల నుంచి అంబులెన్స్‌లో తరలించిన పోలీసులు డ్రైవర్‌తో పాటు అందులో ఉండే ఇతర సిబ్బందిని సాక్షులుగా ఎందుకు పరిగణలోకి తీసుకోలేదన్నది అర్థం కావడం లేదు. అయితే అంబులెన్స్ వాహనం నడిపిన వ్యక్తులు బంగారు ఆభరణాల దొంగతనాల కేసులో నిందితులుగా రామగుండం పోలీసులు అరెస్ట్ కావడం గమనార్హం. నేర స్వభావము ఉన్నట్టుగా ఈ ఘటనలతో తేటతెల్లం అయినందున ఆ తరువాత అయినా అంబులెన్స్ సిబ్బందిని వామన్‌రావు మర్డర్ కేసు విషయంలో విచారించాల్సిన విషయాన్ని పోలీసులు విస్మరించారని అంటున్నారు.
దుబ్బపల్లి టు మంథని..
దుబ్బపల్లి, మంథని మార్గమధ్యలో సీఎం కేసీఆర్ బర్త్ డే రోజున అసలేం జరిగింది. వాస్తవ కోణాలు ఎంటీ అన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. మార్గ మధ్యలో రోడ్డుపై తన కాన్వాయ్‌ని ఆపిన పుట్ట మధు రోడ్డు దిగి దాదాపు 15 నిమిషాల సేపు కుంట శ్రీనుతో మాట్లాడారని తెలుస్తోంది. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంటీ అన్న విషయం తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. వీరిద్దరి మీటింగ్ తరువాతే గట్టు వామన్‌రావు హత్య జరగడంతో అనుమానాలకు బలాన్ని చేకూరుస్తుందని చర్చించుకుంటున్నారు. శ్రీనుతో మాట్లాడిన తర్వాత పుట్ట మధు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లారు. ఇదే సమయంలో మంథని కోర్టుకు చేరుకున్న వామన్ రావు దంపతులను మర్డర్ చేసే పనిలో కుంట శ్రీనివాస్ ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆ సమయంలో కాన్వాయ్‌లో ఉన్న వారిని కానీ, టవర్ లోకేషన్ల వివరాలు కానీ సేకరిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఉన్నతాధికారులు భావిస్తున్నట్టుగా సమాచారం.