గ్లామర్ గర్ల్‌గా లావణ్య..

by Shyam |
గ్లామర్ గర్ల్‌గా లావణ్య..
X

తెలుగు తెరకు ‘అందాల రాక్షసి’ మూవీతో పరచయమైన హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఈ సొట్ట బుగ్గల సోయగం తన సోయగాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ‘భలే భలే మగాడివోయ్’, ‘సోగ్గాడే చిన్నినాయనా’ వంటి భారీ విజయాలను సొంతం చేసుకుంది. అయితే, ఆ తర్వాత కూడా మూవీలు చేస్తూ వెళ్తోంది కానీ, ఆశించిన స్థాయిలో క్రేజ్ రావడం లేదు. అందుకు కారణం తనకు సరైన గ్లామరస్ పాత్రలు పడకపోవడమేనని గ్రహించి, ఆ తరహా పాత్రలను ఇవ్వాలని దర్శకులను కోరుతుందట.

గ్లామరస్‌గా కనిపించేందుకు తను సిద్ధమనే సంకేతాలు ఇవ్వడంతో పలు సినిమాల్లో నటించేందుకు ఆమెకు అవకాశాలు వచ్చినట్టు ఫిల్మ్ నగర్ టాక్. మారుతి – నాని సినిమా, ‘బంగార్రాజు’ సినిమాలోను అవకాశం దక్కడానికి అదే కారణమని చెబుతున్నారు. అయితే, లావణ్య ఏ స్థాయిలో గ్లామర్ డోస్ పెంచుతుందో చూడాలి మరి.

Tags: glamorous roles, lavanya tripathi, TFI

Advertisement

Next Story