- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతి తక్కువ ధరలో.. లావా జెడ్61 ప్రో విడుదల
దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా.. ‘లావా జెడ్61 ప్రో’ పేరుతో ఇండియాలో కొత్త బడ్జెట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. యాంటీ చైనా సెంటిమెంట్ పెరగడంతో పాటు చైనా యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో దేశీ మొబైల్ కంపెనీలైన.. లావా, మైక్రోమ్యాక్స్‌లు సరికొత్త స్మార్ట్‌ఫోన్లను బడ్టెట్ ధరల్లో తీసుకొస్తున్నట్లు ప్రకటించాయి. అన్నట్లుగానే లావా.. ఎంట్రీ లెవల్ బడ్జెట్ ఫోన్‌గా జెడ్ 61ప్రోను తీసుకొచ్చింది. ఈ మొబైల్ మిడ్ నైట్ బ్లూ, అంబెర్ రెడ్ అనే రెండు రంగుల్లో లభించనుంది.
లావా జెడ్61 ప్రో ఫీచర్స్ :
డిస్ ప్లే : 5.45 ఇంచులు
ప్రాసెసర్ : 1.8Ghz ఆక్టాకోర్
ర్యామ్ : 2జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్ : 16జీబీ
రేర్ కెమెరా : 8 మెగాపిక్సల్
ఫ్రంట్ కెమెరా : 5 మెగాపిక్సల్
ఓఎస్ : ఆండ్రాయిడ్
బ్యాటరీ : 3100 ఎంఏహెచ్
రంగులు : మిడ్ నైట్ బ్లూ, అంబెర్ రెడ్
ధర : రూ. 5774/-
లావా నెక్ట్స్ తీసుకురాబోయే స్మార్ట్‌ఫోన్ కోసం ‘డిజైన్ ఇన్ ఇండియా’ కాంటెస్ట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కాంటెస్ట్ ద్వారా స్మార్ట్ ఫోన్ డిజైన్ చేసేందుకు విద్యార్థులు, నిపుణులను ఆహ్వానించింది. అంతేకాదు దీని ద్వారా లావా తన డిజైనర్ ఇంజనీర్లను పెంచుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా బీ.టెక్/బీఈ/బి.డెస్/ఎం.డెస్ విద్యార్థులు, నిపుణులకు ఈ అవకాశాన్ని కల్పించింది. లావా వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా తెలిపింది. రిజిస్ట్రేషన్‌కు ఈ రోజే (జులై 9 ) డెడ్‌లైన్.