లావా ‘డిజైన్ ఇన్ ఇండియా కాంటెస్ట్’

by Harish |
లావా ‘డిజైన్ ఇన్ ఇండియా కాంటెస్ట్’
X

దిశ, వెబ్‌డెస్క్ : యాంటీ చైనా సెంటిమెంట్‌‌కు తోడు ఆ దేశానికి చెందిన యాప్స్‌పై నిషేధం విధించడంతో.. మార్కెట్‌లో ఇం‌డియన్స్ ప్రొడక్ట్స్, యాప్స్ ట్రెండింగ్‌లో కొనసాగుతున్నాయి. రికార్డు స్థాయిలో డౌన్‌లోడ్స్ సాధిస్తున్నాయి. ఈ సదవకాశాన్ని వినిమోగించుకునేందుకు భారతీయ మొబైల్ కంపెనీలన్నీ తమ ప్రయత్నాలు మొదలెట్టాయి. ఇప్పటికే ‘మైక్రోమాక్స్, కార్బన్..’ కొత్త స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తున్నట్లు ప్రకటించడంతో పాటు.. త్వరలోనే వాటిని లాంచ్‌ చేసేందుకు కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ‘లావా’ నెక్ట్స్ తీసుకు రాబోయే స్మార్ట్‌ఫోన్ కోసం ‘డిజైన్ ఇన్ ఇండియా’ కాంటెస్ట్‌ను ప్రారంభించింది.

నోయిడా బేస్డ్ ఇండియన్ మొబైల్ హ్యాండ్‌సెట్ వెండర్ లావా ఇంటర్నేషనల్.. గురువారం ‘డిజైన్ ఇన్ ఇండియా కాంటెస్ట్’కు పిలుపునిచ్చింది. తన తదుపరి ఫోన్‌ను ఇండియాలో డిజైన్ చేసేందుకు విద్యార్థులు, నిపుణులను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా బీ.టెక్/బీఈ/బి.డెస్/ఎం.డెస్ విద్యార్థులు, నిపుణులకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా పిలుపునిచ్చింది. ఈ మేరకు లావా వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతూ, రిజిస్ట్రేషన్‌కు జులై 9న డెడ్‌లైన్ విధించింది. ఐడియేషన్, క్రియేటింగ్ ప్రోటో‌టైప్, ప్రజెంటేషన్.. ఈ మూడు విభాగాల్లో పోటీ నిర్వహిస్తున్నారు. జడ్జింగ్ ప్యానెల్‌కు లావా చీఫ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫీసర్ సంజీవ్ అగర్వాల్ నేతృత్వం వహిస్తారు.

టాలెంట్ ఉన్న వాళ్లను ఎంకరేజ్ చేయడంతో పాటు ఇతర మొబైల్ కంపెనీలకు ధీటుగా లావా మొబైల్స్‌ను డిజైన్ చేయడమే లక్ష్యంగా ఈ కాంటెస్ట్ నిర్వహిస్తున్నామని సంజీవ్ తెలిపారు. ఈ కాంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేసినవారికి ‘లావా డిజైన్ బృందం’ నుంచి గైడెన్స్ అందుతుంది. వీరి నుంచి టాప్-3 బృందాలను ఎంపిక చేసి, వారికి ప్రీ- ప్లేస్‌మెంట్‌తో పాటు ఇంటర్వ్యూ అవకాశం కల్పిస్తుంది లావా. టాప్-3 టీమ్స్‌కు వరుసగా రూ. 50,000, రూ. 25,000, రూ.15,000 అందిస్తారు.

Advertisement

Next Story