కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చిన స్నేహితుడు

by Jakkula Samataha |   ( Updated:2021-06-27 04:08:45.0  )
kathi mahesh accident
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ జర్నలిస్ట్, సినీ నటుడు కత్తి మహేష్ కు రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. జూన్ 26 ఉదయం ఆయన ప్రయాణిస్తున్న కారు నెల్లూరు, చెన్నై హైవేలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కత్తి మహేష్ తీవ్ర గాయాలపాలయ్యారు. చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించగా.. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం చెన్నై కి తరలించారు. ఇక ఐసీయూ లో చికిత్స పొందుతున్న మహేష్ ఆరోగ్యం పై ఇప్పటివరకు సమాచారం లేకపోయేసరికి సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్యంపై పుకార్లు గుప్పుమంటున్నాయి.

కత్తి మహేష్ ఆరోగ్యం విషమించిందని, వైద్యులు సైతం ఏమి చేయలేమని తేల్చిచెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వార్తలపై అతడి స్నేహితుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట సిద్ధారెడ్డి సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు. ప్రస్తుతం కత్తి మహేష్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆయనకు ప్రాణాపాయం తప్పిందని, కన్నుకు తీవ్ర గాయం కావడంతో వైద్యులు సర్జరీ చేసినట్లు తెలిపారు. మహేష్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఎవరు నమ్మవద్దని, వైద్యానికి ఆయన బాగానే స్పందిస్తున్నాడు.. ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆయనను అభిమానించే వాళ్ళు, అలాగే ఆయనంటే పడని వాళ్ళు కూడా మహేష్ కత్తి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Advertisement

Next Story