- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ముఖ్యమంత్రి ఇఫ్తార్‌కు వెళ్తాడు.. భద్రాద్రికి ఎందుకెళ్లడు?
దిశ, తెలంగాణ బ్యూరో: ఉత్తర ప్రదేశ్‌లో దోపిడీలు, దొంగతనాలు, హత్యలకు కారకులైన వారిని ఎవరో హత్యచేస్తే బీజేపీని విమర్శిస్తున్నారని, ఈ అంశమై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతబస్తీలో హత్యలు జరగడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. దీనికి అసదుద్దీన్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ పాతబస్తీలో ఇతర మతస్తులు ఖాళీ చేయడానికి కారణం ఎంఐఎం పార్టీ అని, వారి వల్ల అడ్డికి పావుసేరుకు హిందువులు తమ భూములను అమ్ముకుని ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారని, ముస్లింల అరాచకాల వల్లే ఇది జరిగిందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.
అలాంటిది ఎంఐఎం నేతలు బీజేపీని విమర్శిస్తారా? అని ప్రశ్నించారు. పాతబస్తీలో జరిగే హత్యలకు రూల్ ఆఫ్ లా పనిచేసిందా? రూల్ ఆఫ్ గన్స్, తల్వార్ పనిచేశాయా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పాతబస్తీలో ఈ దుస్థితికి కారకులెవరని ఆయన ప్రశ్నించారు. యూపీలో జరిగిన హత్యపై విచారణకు అదేశించినట్లుగా ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైరయ్యారు. ఒకవైపు సింగరేణిని కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుందంటూ ప్రచారం చేస్తూ.. మరోవైపు సింగరేణితోనే విశాఖ స్టీల్ ప్లాంట్ కొంటామనడంపై ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబం లింక్ లేకుండా మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైరయ్యారు. 2018 ఎన్నికల్లో బయ్యారం స్టీల్ ప్లాంట్ తామే ఏర్పాటు చేస్తామని గొప్పలు చెప్పారని, మరి ఎందుకు నిర్మించలేదో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణలో మూతబడిన పరిశ్రమలను తెరిపిస్తానని హామిలిచ్చి ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలన్నారు. చిన్న తరహా పరిశ్రమల కోసం ఏర్పాటు చేసిన రివాల్వింగ్ ఫండ్ ఏమైందని ఆయన నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వం పోజులకే పరిమితమైందని, అన్ని రంగాల బకాయిలు పెండింగ్‌లో పెట్టిందని మండిపడ్డారు. కేసీఆర్.. తన వైఫల్యాలను పక్కదారి పట్టించడానికి రకరకాల ఎత్తులు ప్రయోగిస్తున్నాడని, ఇది అందరికీ అర్థమైందన్నారు. 9 ఏండ్ల తర్వాత నిద్ర నుంచి మేల్కొని అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశామని చెప్పుకుంటున్నారని, గతంలో ఎన్నడూ అంబేద్కర్ విగ్రహానికి కేసీఆర్ నివాళులర్పించలేదనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు. సీఎం కేసీఆర్.. ఈ ఏడాది అంబేద్కర్‌కు నివాళులర్పించినట్లే వచ్చే ఏడాది కూడా నివాళులర్పించాలన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా, లేకున్నా రావాలని కోరారు. ఇక దళితుల కోసం తెచ్చిన దళితబంధు కాస్తా బీఆర్ఎస్ బంధుగా మారిందని ఎద్దేవా చేశారు.
ఇఫ్తార్ విందుకు వెళ్లే కేసీఆర్‌కు భద్రాద్రికి వెళ్లే టైం మాత్రం లేకుండా పోయిందని విమర్శలు చేశారు. దేశంలోని అన్ని పార్టీల నేతలతో మాట్లాడేందుకు సమయం ఉంటుంది.. కానీ రాష్ట్ర సమస్యలపై మాట్లాడే సమయం కేసీఆర్ కు ఉండదని చురకలంటించారు. ముఖ్యమంత్రి కుటుంబీకులు అయినంత మాత్రాన తప్పు చేస్తే విచారణ చేయొద్దని రూల్ ఏమైనా ఉందా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రాన్ని దోచుకున్నది సరిపోలేదని దేశాన్ని దోచుకునేందుకు వెళ్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ఉన్నా.. ఇంకెవరు ఉన్నా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. తాను కేసీఆర్ కు లేఖ రాసేది.. ఆయన రిప్లై ఇస్తారని కాదని, తెలంగాణ ప్రజల బాగుకోసమని క్లారిటీ ఇచ్చారు.