తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

by Shiva |
తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం
X

తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలేశుడి సన్నిధిలో తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వివిధ రకాల పుష్పాలతో శ్రీవారి ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఈరోజు తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతం, అర్చన, తోమాల సేవల తర్వాత బంగారు వాకిలి వ‌ద్ద స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం నైవేద్యం సమర్పణ చేయనున్నారు. స్వామి వారి ముందు ఆగమ పండితులు, అర్చకులు పంచాగ శ్రవణం చేయడంతో ఉగాది ఆస్థానాన్ని వైభవంగా ముగియనుంది. ఉగాది పండుగ సందర్భంగా శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు తరలివచ్చారు. శ్రీవారిని దర్శించుకునేందుకు రెండు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది.

Advertisement

Next Story