- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొత్తగూడెంలోని స్వరాజ్యం పుట్టినిల్లు ఇదే..
దిశ,తుంగతుర్తి: ఉద్యమ వీరులకు పురుడు పోసిన ఆ ఇల్లు మూగబోయింది. నన్ను విడిచి శాశ్వతంగా వెళ్లిపోయారా..! అంటూ ఓ వైపు మౌనంగా రోదిస్తుంది. మరోవైపు మాత్రం మీలాంటి వారిని కన్నందుకు నా జన్మ ధన్యమైంది అంటూ...ఆ రాజసం ఉట్టి పడే బంగ్లా గర్వపడుతోంది. అంతేకాదు లోలోన మురిసిపోతోంది. తెలంగాణ సాయుధ పోరాట యోధులే కాకుండా పేదల పక్షాన జరిగే అనేక ఉద్యమాలకు ఊపిరి పోసిన స్వర్గీయులు భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం,భీమిరెడ్డి కుశలవ రెడ్డి,తదితరులకు పురుడు పోసి పెంచి పెద్ద చేసిన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలోని బంగ్లా పరిస్థితి ఇది. మొదటి నుండి ఈ బంగ్లాకు విశిష్టమైన ప్రాముఖ్యత ఏర్పడింది. ఉద్యమాలకు ఊపిరి పోయాలన్నా...పేదల పక్షాన ఉద్యమాలు చేయాలన్నా ఆపత్కాలంలో ఉన్నవారికి అండ దొరకాలన్నా.. అన్ని ఈ బంగ్లాలోనే.
ధర్మం,న్యాయం బంగ్లా చుట్టూ (నలుదిక్కుల)తిరుగుతూ పేదోడి ఆర్తనాదాలకు అభయ హస్తం అందించేది. ముఖ్యంగా అన్న భీమిరెడ్డి నరసింహారెడ్డి,తమ్ముడు కుశలవ రెడ్డి బతికున్న కాలంలో స్వరాజ్యం తన పుట్టినిల్లు అయిన ఈ ఇంటికికే వచ్చేది. పండుగలు,పబ్బాలు,ఫంక్షన్లు,తదితర కార్యక్రమాలకు హాజరై ఇటు పుట్టింటికి...అటు గ్రామస్తుల మధ్య నడయాడుతూ అందరికీ సంతోషాన్ని ఇచ్చేది. మెట్టినింటి నుండి వచ్చినప్పుడల్లా గ్రామస్తులతో నోట్లో నాలుకలా కలిసి ఉండేది. పేరుపేరునా పిలుస్తూ యోగక్షేమాలు తెలుసుకునేది. బాధలు,కష్టాల పరిష్కారంలో నేనున్నానంటూ గ్రామస్థుల దరిచేరేది. ముఖ్యంగా అగ్రకులంలో (రెడ్డి) జన్మించినప్పటికీ ఆధ్యాస,ఆ గర్వం మచ్చుకైనా వారిలో ఏ మాత్రం కనపడేది కాదు. వారి నోటి వెంట కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవాలి అనే మాటలే ప్రధానంగా వినిపిస్తూ ఉండేవి. అలాంటి వీరులకు జన్మనిచ్చి విశిష్టమైన ప్రాముఖ్యత సంపాదించుకున్న ఆ స్వగృహం ఎంత పుణ్యాన్ని కట్టుకుందో....!