బౌలింగ్ తో అదరగొట్టిన పోలీస్.. నెటిజన్లు ఫిదా

by Shiva |   ( Updated:2023-08-13 15:35:55.0  )
బౌలింగ్ తో అదరగొట్టిన పోలీస్.. నెటిజన్లు ఫిదా
X

దిశ, వెబ్ డెస్క్ : పోలీస్ వృత్తి అంటేనే.. ఉరుకుల పరుగల జీవితం. నిత్యం ఏదో ఒక టెన్షన్, ప్రతి కేసు ఒక సవాల్. అయితే, అవన్ని పటాపంచలు చేస్తూ ఓ ఖాకీ తాము ఎవరికి తక్కువ కాదంటూ తాన టాలెంట్ చూపించాడు. రాజస్థాన్ కు చెందిన దుర్జన్ హర్సాని అనే పోలీస్ తన అసాధారాణ బౌలింగ్ తో ఐపీఎల్ ఫ్రాంచైజీ మనసు దోచుకున్నాడు.

రాజస్థాన్ లోని జైపూర్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ సెషన్ లో హర్సాని ఓ బ్యాట్స్ మెన్ కు బౌల్ చేయగా ప్రతి బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో ఇంప్రెస్ అయిన ముంబై ఇండియన్స్ అందుకు సంబంధించిన వీడియోను ఇటీవల తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. ఆ పోలీసు యొక్క అసాధారణమైన బౌలింగ్ నైపుణ్యాన్ని ప్రశంసించింది.

Advertisement

Next Story