డీఎస్సీపై శుభవార్త చెప్పిన మంత్రి బొత్స సత్యనారాయణ

by Shiva |
డీఎస్సీపై శుభవార్త చెప్పిన మంత్రి బొత్స సత్యనారాయణ
X

అమరావతి: డీఎస్సీ ఉద్యోగాల భర్తీపై మంత్రి బొత్స సత్యనారాయణ శుభవార్త చెప్పారు. ఏపీ డీఎస్సీపై త్వరలోనే ఖాళీలు గుర్తించి కార్యాచరణ విడుదల చేస్తామని మంత్రి అన్నారు. కేంద్రం పార్లమెంటులో ప్రకటించిన సమాచారం కూడా తప్పే, ఏపీ అధికారులు కొవిడ్‌కు ముందు ఉన్న సమాచారాన్ని కేంద్రానికి ఇచ్చారని మంత్రి చెప్పారు. అందుకే కేంద్రం నుంచి పొరపాటు ప్రకటన వచ్చిందని, తమ ప్రభుత్వం వచ్చాక 12వేల పైచిలుకు ఖాళీలు భర్తీ చేశామని, త్వరలో ఖాళీలు గుర్తించి తగిన కార్యాచరణ ప్రకటిస్తామని బొత్స తెలిపారు.

Advertisement

Next Story